Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: 'స్టాండ్ అప్ రాహుల్'.. కూర్చుంది చాలు..!

By:  Tupaki Desk   |   24 March 2021 6:39 AM GMT
ఫస్ట్ లుక్: స్టాండ్ అప్ రాహుల్.. కూర్చుంది చాలు..!
X
యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''స్టాండ్ అప్ రాహుల్''. `కుర్చుంది చాలు` అనేది దీనికి ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి సాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్నారు. 'జాను' ఫేమ్ వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా న‌టిస్తోంది. డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్ మరియు హై ఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నంద్‌ కుమార్ అబ్బినేని - భ‌ర‌త్ మాగులూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని ఆవిష్కరించి చిత్ర బృందానికి విషెస్ తెలియజేసింది.

''మైక్ టెస్టింగ్ 1..2..3.. చెక్ చెక్.. రాజ్ త‌రుణ్ కూర్చుంది చాలు.. ఫ‌స్ట్ లుక్‌, అండ్ టైటిల్ `స్టాండ‌ప్ రాహుల్‌`. ఔట్ స్టాండింగ్ స‌క్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అని స‌మంత ట్వీట్ చేసింది. 'స్టాండ్ అప్ రాహుల్' ఫస్ట్ లుక్ లో రాజ్ తరుణ్ షార్ట్ - బ్లూ క‌ల‌ర్ టీ ష‌ర్ట్ ధ‌రించి కూర్చొని ఉన్నాడు. చుట్టూ మైకులు ఉండగా మెడలో హెడ్ ఫోన్స్ - ఒంటి నిండా కేబుల్స్ చుట్టుకొని దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ కి స్వీకర్ అగస్తి సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ‌రాజ్ ర‌వీంద్ర‌న్ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.