Begin typing your search above and press return to search.

ఫ‌స్ట్ లుక్‌: స‌రిలేరు నీకెవ్వ‌రు భార‌తీ మ్యాడ‌మ్

By:  Tupaki Desk   |   26 Oct 2019 4:26 AM GMT
ఫ‌స్ట్ లుక్‌: స‌రిలేరు నీకెవ్వ‌రు భార‌తీ మ్యాడ‌మ్
X
దాదాపు 13ఏళ్ల గ్యాప్ త‌ర్వాత తిరిగి సినీ ఎంట్రీ ఇస్తున్నారు లేడీ బాస్ విజ‌య‌శాంతి. రాజ‌కీయాల్లోకి వెళ్లాక అక్క‌డ త‌న‌ టోన్ పూర్తిగా మారింది. ఇప్పుడు తిరిగి సినిమాల్లో న‌ట‌న‌ అంటే కంబ్యాక్ ఎలా ఉంటుందోన‌న్న ఉత్కంఠ అభిమానుల్ని నిల‌వ‌నీయ‌డం లేదు. గ్లామ‌ర‌స్ నాయిక‌గా నిరూపించుకుని.. సీనియారిటీ తో నాయికా ప్రాధాన్య‌త‌కు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన విజ‌య‌శాంతి తిరిగి త‌న స్థాయిని పెద్ద తెర‌పై ఎలా ఆవిష్క‌రించ‌బోతున్నారు? అన్న ఆస‌క్తి అంద‌రిలో ఉంది.

అయితే అన్ని ప్ర‌శ్న‌ల‌కు ఇదిగో ఇదే స‌మాధానం. నేడు దీపావ‌ళి శుభాకాంక్ష‌ల‌తో విజ‌య‌శాంతి ఫ‌స్ట్ లుక్ రిలీజైంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి ధీటుగా `స‌రిలేరు నీకెవ్వరు`లో లేడీ బాస్ లుక్ ఉంటుంద‌ని ఇదిగో ఈ పోస్ట‌ర్ చెబుతోంది. ఈ చిత్రంలో భార‌తి అనే డిగ్నిఫైడ్ మ‌హిళ‌గా విజ‌య‌శాంతి క‌నిపించ‌నున్నారు. బూడిద రంగు చీర‌.. కాంబినేష‌న్ బ్లౌజ్.. కాటుక క‌ళ్లు.. నుదిటిన న‌ల్ల‌ని బొట్టు.. తీర్చిదిద్దిన ఐబ్రోస్.. లేత రంగు లిప్ స్టిక్ అద్ద‌కం.. అంతే సింపుల్ హెయిర్ స్టైల్ .. అస‌లు ఒక కాలేజ్ లెక్చ‌ర‌ర్ అంత హుందాగా క‌నిపించారంటే న‌మ్మండి. ఠీవిగా కాలు మీద కాలు వేసుకుని కూచున్నారంటే అది క‌చ్ఛితంగా లెక్చ‌ర‌ర్ కి లేదా ఏదైనా ప్ర‌భుత్వ అధికారికి ఉండే ఠీవి అనే చెప్పాలి. అయితే ఈ చిత్రంలో భార‌తి పాత్ర‌లో న‌టిస్తున్నారు అని చెప్పారే కానీ లెక్చ‌ర‌ర్ గా న‌టిస్తున్నారు అని మాత్రం రివీల్ చేయ‌లేదు టీమ్. ఇదంతా అభిమానుల ఊహాగానం మాత్ర‌మే. భార‌తి మ్యాడ‌మ్ సింపుల్ .. స్ట్రైకింగ్.

ఓ కాలేజ్ లో లెక్చ‌రర్ గా ప‌ని చేసే భార‌తీ మ్యాడ‌మ్ కి జ‌రిగే అవ‌మానాల్ని అన్యాయాల్ని ఎదురించేందుకు బార్డ‌ర్ నుంచి వ‌చ్చే సైనికుడిగా మ‌హేష్ క‌నిపిస్తార‌ని ఇంత‌కుముందే ఓ లీక్ అందింది. క‌శ్మీర్ టు క‌ర్నూల్ కొండా రెడ్డి బురుజు స్టోరీలో చాలానే లాజిక్ మ్యాజిక్ ఉంటుంద‌ట‌. క‌శ్మీర్ నుంచి రైలు ప్ర‌యాణంలో ర‌ష్మిక‌తో మ‌హేష్ రొమాన్స్ ఆ లెవ‌ల్లోనే ఉంటుంద‌ని తెలుస్తోంది. 2020 జ‌న‌వ‌రి 12న ట్రీటిచ్చేందుకు ముందుకు వ‌స్తున్నారు. ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి చిత్రీక‌ర‌ణ‌ను వేగంగా ప‌రుగులు పెట్టిస్తున్నారు. అనీల్ సుంక‌ర‌- దిల్ రాజు ఏమాత్రం రాజీకి రాకుండా క‌శ్మీర్ షెడ్యూల్ తో పాటు.. హైద‌రాబాద్ లో సెట్స్ వేసి భారీ షెడ్యూల్స్ కోసం భారీగానే పెట్టుబ‌డులు పెట్టారు.