Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: 'రామారావు ఆన్ డ్యూటీ' అంటున్న రవితేజ..!

By:  Tupaki Desk   |   12 July 2021 5:15 AM GMT
ఫస్ట్ లుక్: రామారావు ఆన్ డ్యూటీ అంటున్న రవితేజ..!
X
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'ఖిలాడి' సినిమాతో పాటుగా #RT68 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరత్‌ మండవ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఆర్‌టి టీమ్‌ వర్క్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ''రామారావు ఆన్ డ్యూటీ'' అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

''రామారావు ఆన్ డ్యూటీ'' ఫస్ట్ లుక్ పోస్టర్ లో మాస్ రాజా రవితేజ హాఫ్ స్లీవ్ షర్ట్ - ఫార్మల్ ప్యాంట్‌ ధరించి ట్రెండీ గాగుల్స్ పెట్టుకొని సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అంతేకాదు ఈ పోస్టర్‌ లో రవితేజ ప్లే చేస్తున్న బి.రామారావు పేరుతో ప్రమాణ స్వీకార పత్రం కూడా ఉంది. అలానే ఆయనకు కేటాయించిన ప్రభుత్వ వాహనం మరియు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం అనే బోర్డులను బ్యాగ్రౌండ్ లో చూడవచ్చు. ఫస్ట్ లుక్ ని బట్టి ఇందులో రవితేజ దూకుడు స్వభావం కలిగిన నిజాయితీ గల ప్రభుత్వ అధికారిగా నటించాడని తెలుస్తోంది. టైటిల్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా అద్భుతంగా ఉండేలా డిజైన్ చేశారు.

''రామారావు ఆన్ డ్యూటీ'' చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కిస్తున్నప్పటికీ.. దీనికి సంబంధించిన ప్రతి ప్రకటన క్యూరియాసిటీ పెంచుతోంది. ఇంతకుముందు, రవితేజ ముఖం కనిపించకుండా మేకర్స్ ఆవిష్కరించిన రెండు పోస్టర్లు కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. అలానే ప్రీ-లుక్ పోస్టర్ ద్వారా రవితేజ ఇందులో రెండు షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నాడని హింట్ ఇవ్వగా.. ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఒక గెటప్ ని రివీల్ చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన కథతో ఈ చిత్రాన్ని ఒక స్పెషల్ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రూపొందిస్తున్నారు.

''రామారావు ఆన్ డ్యూటీ'' చిత్రంలో 'మజిలీ' ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌ లో జరుగుతుండగా.. రవితేజ మరియు దివ్యన్షా కౌశిక్ పాల్గొంటున్న ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. సత్యన్‌ సూర్యన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాజర్ - నరేష్ - పవిత్ర లోకేష్ - రాహుల్ రామకృష్ణ - 'ఈరోజుల్లో' శ్రీ - సురేఖ వాణి - మధు సూధన్ రావు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.