Begin typing your search above and press return to search.

ఊర మాస్ ద‌స‌రాకు సైర‌న్ మోగించిన నాని

By:  Tupaki Desk   |   20 March 2022 6:45 AM GMT
ఊర మాస్ ద‌స‌రాకు సైర‌న్ మోగించిన నాని
X
నేచుర‌ల్ స్టార్ నాని గ‌త కొంత కాలంగా ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని ఆక‌ట్టుకుంటున్నారు. అయితే ఈ సారి త‌న పంథాని మార్చారు. ఊర‌మాస్ అవ‌తారం ఎత్తారు. `పుష్ప‌`లో బ‌న్నీ `పుష్ప‌రాజ్‌`గా ర‌గ్గ్‌డ్ క్యారెక్ట్‌ని ఎలాగైతే స‌రికొత్త మేకోవ‌ర్ తో ర‌క్తి క‌ట్టించారో అదే పంథాని ఫాలో అవుతూ నేచుర‌ల్ స్టార్ నాని త‌న కొత్త చిత్రం `ద‌స‌రా` కోసం ఊర మాస్ అవ‌తారంలోకి వ‌చ్చేశారు. కోల్ మైన్స్ నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ ల‌వ్ డ్రామాగా ఈ మూవీని ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్నారు.

శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్ పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ తెలంగాణ క‌రీంన‌గ‌ర్ జిల్లా గోదావ‌రిఖ‌ని సింగ‌రేణి బొగ్గుగ‌ని నేప‌థ్యంలో ప‌క్కా మాసీవ్ అంశాల‌తో సాగ‌బోతోంది. `శ్యామ్ సింగ‌రాయ్‌` తో సాలీడ్ హిట్ ని సొంతం చేసుకున్న హీరో నాని ఈ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో ఆక‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నించారు కానీ ఆ ప్ర‌య‌త్నాలు కొంత వ‌ర‌కే స‌ఫ‌లం అయ్యాయి.

అయితే తాజా చిత్రం `ద‌స‌రా`తో పాన్ ఇండియా స్థాయి మార్కెట్ ని టార్గెట్ చేశారు నాని. ఊర మాస్ అంశాల నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ ఏక కాలంలో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ మూవీని ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభించిన చిత్ర బృందం తాజాగా రెగ్యుల‌ర్ షూటింగ్ ని ప్రారంభించింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఆదివారం `స్పార్క్ ఆఫ్ ద‌స‌రా` పేరుతో ఓ వీడియోని విడుద‌ల చేసింది.

శ‌నివారం సాయంత్ర‌మే ఆదివారం స‌ర్ ప్రైజ్ ఇవ్వ‌బోతున్నామంటూ ప్ర‌క‌టించిన మేక‌ర్స్ టెక్నిక‌ల్ కార‌ణాల వ‌ల్ల అర గంట ఆల‌స్యంగా ఈ వీడియోని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. మండుతున్న ఓపెన్ క్వారీలో టిప్ప‌ర్ ల‌లో బొగ్గు లోడ్ చేస్తున్న విజువ‌ల్స్ తో వీడియో మొద‌లైంది. బ్లాక్ క‌ల‌ర్‌ గ‌ల్ల లుంగీ.. రెడ్ ష‌ర్ట్ ధ‌రించి చేతిలో బీడీ ప‌ట్టుకుని మండుతున్న బొగ్గుతో బీడీని అంటించుకుని.. ముందు రెండు 90 ఎం.ఎల్ బాటిల్స్ తో ఊర మాస్ అవ‌తార్ లో నాని క‌నిపిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది.

సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. ఈ మూవీతో ఊర మాస్ ద‌స‌రాకు నాని సైర‌న్ మోగించాడ‌ని ఈ వీడియో చూసిన వారంతా అంటున్నారు. ప‌క్కా తెలంగాణ స్లాంగ్ లో నాని సంభాష‌ణ‌లు సాగ‌నున్న ఈమూవీ నాని నుంచి మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని కోరుకుంటున్న ప్రేక్ష‌కుల‌కు విజువ‌ల్ ఫీస్టేన‌ని చెబుతున్నారు.

ఇందులో నాని పాత్ర పేరు ధ‌ర‌ణి. త‌నికి బొగ్గు గ‌నికి వున్న సంబంధం ఏంటీ? .. ఈ వీడిమోలో అత‌ని వెంట దెబ్బ‌లు త‌గిలిన గాయాల‌తో వ‌స్తున్న జ‌నానికి మ‌ధ్య వున్న అనుబంధం ఏంటీ? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.