Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్ ఫుల్ విక్ర‌మ్ వ‌చ్చేశాడు

By:  Tupaki Desk   |   25 Feb 2022 12:30 AM GMT
ప‌వ‌ర్ ఫుల్ విక్ర‌మ్ వ‌చ్చేశాడు
X
2017 లో సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం `విక్ర‌మ్ వేద‌`. మాధ‌వ‌న్ - విల‌క్ష‌న్ హీరో విజ‌య్ సేతుపతి తొలి సారి క‌లిసి న‌టించారు. శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ హీరోయిన్ లు. పుష్క‌ర్ - గాయ‌త్రి జంట‌గా డైరెక్ట్ చేసిన ఈ మూవీ యాక్ష‌న్ చిత్రాల్లో స‌రికొత్త సంచల‌నంగా మారింది. ఓ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ కీ, గ్యాంగ్‌స్ట‌ర్ కి మ‌ధ్య సాగే స‌మ‌రం నేప‌థ్యంలో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించారు. త‌మిళంలో సంచ‌ల‌నం సృష్టించిన ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయాల‌ని ప్లాన్ చేశారు కానీ ఇంత వ‌ర‌కు అది కార్య‌రూపం దాల్చ‌లేదు.

అయితే ఈ మూవీని బాలీవుడ్ లో ఇద్ద‌రు క్రేజీ హీరోల‌తో రీమేక్ చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. హృతిఖ్ రోష‌న్ - సైఫ్ అలీఖాన్ ఇందులో న‌టిస్తున్నారు. మాధ‌వ‌న్ పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ న‌టిస్తుండ‌గా విజ‌య్ సేతుప‌తి పాత్ర‌లో హృతిక్ రోష‌న్ న‌టిస్తున్నారు. పుష్క‌ర్ - గాయ‌త్రి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి స్పెష‌ల్ 26, బేబీ - ఎం.ఎస్ ధోనీ ద అన్ టోల్డ్ స్టోరీ` ఫేమ్ నీర‌జ్ పాండే స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇటీవ‌ల వేద పాత్ర‌లో న‌టిస్తున్న హృతిక్ రోష‌న్ ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేసిన మేక‌ర్స్ తాజాగా విక్ర‌మ్ పాత్ర‌లో న‌టిస్తున్న సైఫ్ అలీఖార్ ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేశారు.

డెనిమ్ బ్లూ క‌ల‌ర్ జీన్స్ , వైట్ టీషర్ట్‌.. గాగుల్స్ ధ‌రించి సైఫ్ సీనియ‌స్ గా ప‌వ‌ర్ ఫుల్ లుక్ లో క‌నిపిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వై నాట్ స్టూడియోస్ - రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ - ప్లాన్ సి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీల‌క పాత్ర‌లో రాధికా ఆప్టే న‌టిస్తోంది.

విక్ర‌మ్ పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ టెర్రిఫిక్ లుక్ ని విడుద‌ల చేసిన మేక‌ర్స్ ఇదే సంద‌ర్భంగా ఈ ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ డ్రామా రిలీజ్ డేట్ ని కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించేశారు. భారీ అంచ‌నాల మ‌ధ్య రూపొందుతున్న ఈ మూవీని మేక‌ర్స్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.