Begin typing your search above and press return to search.
విజయ్ ఆంటోని 'విజయ రాఘవన్' ఫస్ట్ లుక్..!
By: Tupaki Desk | 14 Nov 2020 10:00 AM ISTకోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో విజయ్ ఆంటోని. 'నకిలీ' 'డా.సలీమ్' 'బిచ్చగాడు' 'భేతాళుడు' 'ఇంద్రసేన' 'రోషగాడు' 'కిల్లర్' వంటి సినిమాలతో విజయ్ ఆంటోని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో విజయ్ ఆంటోని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కోడియిల్ ఒరువన్' ని కూడా తెలుగు ఆడియన్స్ కి అందించనున్నారు. 'మెట్రో' ఫేమ్ ఆనంద కృష్ణన్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగులో ''విజయ రాఘవన్'' పేరుతో విడుదల చేయనున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
'విజయ రాఘవన్' ఫస్ట్ లుక్ లో నీట్ గా టక్ చేసుకున్న విజయ్ ఆంటోని ఎత్తైన భవనాల సముదాయంపై స్టైల్ గా కాలుపై కాలు వేసుకుని కూర్చున్నట్లుగా చూపించారు. ఇంటెన్స్ లుక్ తో విజయ్ ఆంటోని ఆకట్టుకుంటున్నాడు. బిల్డింగ్స్ పై నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరియు గాంధీ ఫోటోలు కనిపిస్తున్నాయి. అలానే టైటిల్ డిజైన్ లో కలం పట్టుకొని పిడికిలి బిగించిన చేతి ముద్ర కూడా ఆసక్తిని కలిగిస్తోంది. తెలుగులో ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై టి.డి.రాజా - డి.ఆర్.సంజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణను జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.