Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్ః నాని సమర్పించు.. 'ఆ!'

By:  Tupaki Desk   |   25 Nov 2017 12:24 PM GMT
ఫస్ట్ లుక్ః నాని సమర్పించు.. ఆ!
X
ఇప్పుడు హీరో నాని కూడా ప్రొడ్యూసర్ గా మారాడన్న సంగతి మనం ఆల్రెడీ చెప్పుకుందే. అయితే ఈ సినిమాను ఆల్రెడీ 80% పూర్తి చేశాం అని తెలిపిన నాని.. ఇప్పుడు ఆ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. ప్రశాంత్ వర్మ డైరక్షన్లో రూపొందిన 'ఆ' సినిమాను నాని సమర్పించగా.. బాహుబలి సినిమాకు ఒక కాస్ట్యూమ్ డిజైనర్ అయిన ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించింది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ... టైటిల్ ను ఒక కాఫీలో స్మయిలీ బదులుగా ''ఆ'' అని ఉన్నట్లుగా డిజైన్ చేసి.. ఇదేదో క్యూట్ లవ్ స్టోరీ అని చూపించారు. అయితే అక్కడే పక్కనే ఉన్న భగవద్గీత.. క్రిందే పేపర్లో చుట్టేసిన ఒక గన్.. ఆ క్రిందనే ఆర్గాన్ డొనేషన్ (అవయవ దానం)కోసం సైన్ చేసే నో-అబ్జెక్షన్ ఫామ్ ను చూస్తుంటే.. ఇదేదో డిఫరెంట్ క్రయిమ్ థ్రిల్లర్ అని అర్దమవుతోంది. అవయవ దానం చుట్టూతా తిరిగే చాలా కధలను మనం చూశాం కాని.. ఇలా ఈ ఎలిమెంట్స్ అన్నీ చుట్టేసి ఒక కథను రెడీ చేయడం.. దానిని నాని ప్రొడ్యూస్ చేయడం.. కాస్త ఆసక్తికరంగానే ఉంది.

అంతకంటే పెద్ద విషయం ఏంటంటే.. ఈ సినిమాలో క్యాస్టింగ్ ఉంది చూశారూ.. అదిరిపోయింది అంతే. నిత్యా మీనన్.. శ్రీనివాస్ అవసరాల.. రెజీనా కసాండ్ర.. ప్రియదర్శి.. ఈషా.. మరియు కాజల్ అగర్వాల్.. ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు నాని అండ్ రవితేజ.. ఇద్దరూ వాయిస్ ఓవర్ ఇచ్చారు.