Begin typing your search above and press return to search.

'ఛత్రివాలి' ఫస్ట్ లుక్: కండోమ్ ప్యాకెట్ తో రకుల్ ప్రీత్..!

By:  Tupaki Desk   |   13 Nov 2021 2:57 PM GMT
ఛత్రివాలి ఫస్ట్ లుక్: కండోమ్ ప్యాకెట్ తో రకుల్ ప్రీత్..!
X
సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హిందీ సినిమా ''ఛత్రివాలి''. దర్శకుడు తేజస్ ప్రభ విజయ్ దేవస్కర్ ఈ చిత్రాన్ని సోషల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నారు. రకుల్ ఇందులో మునుపెన్నడూ కనిపించని ప్రత్యేకమైన పాత్రలో నటించింది. ఆమె ఈ చిత్రంలో కండోమ్ టెస్టర్ క్యారెక్టర్ లో కనిపించనుంది.

'ఛత్రివాలి' చిత్రంలో తన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. 'ఎలాంటి వాతవరణ సూచన లేకుండా వర్షం కురుస్తుంది.. మీ గొడుగును సిద్ధంగా ఉంచుకోండి' అని దీనికి క్యాప‍్షన్‌ కూడా పెట్టింది. ఈ పోస్టర్‌ లో రకుల్ కండోమ్ ప్యాకెట్‌ ను చింపుతున్నట్లు పోజ్ ఇచ్చింది. రకుల్ కెరీర్‌ ప్రారంభం నుంచీ బోల్డ్ చిత్రాలు చేయడానికి ఎప్పుడూ వెనకాడలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్ర చేస్తోంది.

కండోమ్ టెస్టర్ గా నటిస్తున్న రకుల్ గతంలో ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాపై విపరీతమైన హైప్ ఏర్పడింది. ఇప్పుడు ఏకంగా కండోమ్ ప్యాకెట్ పట్టుకొని కనిపించి షాక్ ఇచ్చింది. 'ఛత్రివాలి' సినిమా కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసి ఓ నిరుద్యోగి మహిళ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఆమెకు కండోమ్‌ టెస్టర్‌ జాబ్ ఎలా దొరికింది?. ఆమె తన ఉద్యోగం గురించి ఇరుగుపొరుగు వారికి తెలియకుండా ఎలా దాచింది? ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? అనేదే ఈ స్టోరీ.

ఆర్ఎస్వీపీ మూవీస్ బ్యానర్ పై రోనీ స్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సుమీత్ వ్యాస్ - సతీష్ కౌశిక్ - రాజేష్ తైలాంగ్ - ప్రాచీ షా పాండ్యా ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల లక్నోలో ప్రారంభమైంది. 'ఛత్రివాలి' సినిమా గురించి రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ఇది చాలా ఆసక్తికరమైన, కొత్త రకమైన కథ. ఈ పాత్ర చేయడానికి నేను చాలా థ్రిల్‌ ఫీల్‌ అవుతున్నాను. తేలికైన పద్ధతుల్లో కొన్ని సమస్యలను హైలెట్‌ చేసి చూపించడం అనేది నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది అని అన్నారు.

తేజస్‌ దేవస్కర్‌ మాట్లాడుతూ.. ఇదొక సోషల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఇందులో కండోమ్‌ ల వాడకాన్ని ప్రధానాంశంగా చూపించాం. సినిమా విడుదల కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నాం. రకుల్ పోషించే పాత్ర ఆమెకు కొత్తదనాన్ని తీసుకొస్తుంది. ఇలాంటి సున్నితమైన, ఆలోచింపజేసే సబ్జెక్ట్‌ తో ఉన్న ఈ కామెడీ రోలర్‌-కోస్టర్‌ రైడ్‌ ను ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు అని అన్నారు.