Begin typing your search above and press return to search.

RRR అప్డేట్: అజయ్ దేవగన్ బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్..!

By:  Tupaki Desk   |   30 March 2021 7:48 AM GMT
RRR అప్డేట్: అజయ్ దేవగన్ బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్..!
X
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ ఫిక్షనల్ పీరియాడికల్ మూవీలో అజయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే తన పాత్ర చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 2 అజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను 'RRR' టీమ్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.

అజయ్ దేవగన్ ఇంతవరకూ చూడని ఓ కొత్త అవతారంలో ఆయన కనిపించబోతున్నాడని.. అదో పవర్ ఫుల్ క్యారెక్టర్ అని 'ఆర్.ఆర్.ఆర్' చిత్ర బృందం పేర్కొంది. దీనిపై అజయ్ స్పందిస్తూ.. 'RRR మూవీలో భాగం కావడం ఒక ఉత్తేజకరమైన అనుభవం. రాజమౌళి నా పాత్రను ఎలా డిజైన్ చేశారో చూపించడానికి నేను ఆగలేకపోతున్నాను' అని ట్వీట్ చేశాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.

ఇకపోతే డీవీవీ దానయ్య నిర్మిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల కానుంది. అదే సమయంలో అక్టోబర్ 15న అజయ్ దేవగన్ హీరోగా నటించిన ''మైదాన్'' మూవీ కూడా రిలీజ్ అవుతుంది. అంటే ఈ ఏడాది విజయదశమికి అజయ్ దేవగన్ తాను నటించిన సినిమాలతో బరలో దిగుతూ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారు.