Begin typing your search above and press return to search.

అనుభ‌వించు రాజా! గెట్ రెడీ ఫ‌ర్ ట్రీట్!!

By:  Tupaki Desk   |   31 Oct 2021 6:30 AM GMT
అనుభ‌వించు రాజా! గెట్ రెడీ ఫ‌ర్ ట్రీట్!!
X
జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుసగా అవ‌కాశాలు అందుకుంటున్నాడు రాజ్ త‌రుణ్‌. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అత‌డి ప్ర‌తిభ‌ను న‌మ్మి అవ‌కాశాలిస్తున్నారు. రాజ్ తరుణ్ హీరోగా గవిరెడ్డి శ్రీను దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న తాజా సినిమా-`అనుభవించు రాజా`. అన్నపూర్ణ స్టూడియోస్ - శ్రీవెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్ ఆహార్యం రొమాంటిక్ గా ఉంటుంద‌ని ఇటీవ‌ల‌ రిలీజ్ చేసిన ప్ర‌చార చిత్రాలు.. టైటిల్ సాంగ్ వెల్ల‌డించాయి. గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

``రాజు వెడలె రవితేజములలరగ .. నారీ మణుల కళ్లు చెదరగ .. వైరి వీరుల గుండెలదరగా`` పాట‌ను రిలీజ్ చేయ‌గా వైర‌ల్ అయ్యింది. రాజ్ త‌రుణ్ క్యారెక్ట్ ఇందులో విభిన్న‌మైన‌ గెట‌ప్పుల‌తో విలేజ్ ఆక‌తాయిగా క‌నిపిస్తార‌ని అర్థ‌మైంది. తాజాగా రిలీజ్ తేదీని ప్ర‌క‌టించింది చిత్ర‌బృందం. ఈ నెల 26న రెడీగా ఉండండి. మా సినిమా బరిలో - మా బంగారం థియేటర్ లో .. అంటూ సోష‌ల్ మీడియాల్లో వెల్ల‌డించారు. వినోదాల బృందావ‌నంలో రాజా ఏ మేర‌కు అల‌రిస్తాడు? అన్న‌ది వేచి చూడాలి.

అన్న‌పూర్ణ స్టూడియోస్ ఇంత‌కుముందు రాజ్ త‌రుణ్ ని ప‌రిచ‌యం చేయ‌డ‌మే గాక విజ‌యం అందుకుంది. త‌ర్వాత అత‌డితోనే చేసిన రంగుల రాట్నం ఫెయిలైంది. కానీ ఇప్పుడు మ‌రో హిట్టు కోసం అత‌డితో సినిమా చేస్తోంది. SVCLLP కూడా ఈసారి అన్న‌పూర్ణ బ్యాన‌ర్ తో టై అప్ అయ్యింది. గోపిసుంద‌ర్ బాణీలు ఈ చిత్రానికి అస్సెట్ కానున్నాయి. చాలా కాలంగా రాజ్ త‌రుణ్ స‌రైన విజయం కోసం వేచి చూస్తున్నాడు. ఈ సినిమాతో పెద్ద హిట్టు కొడ‌తాడ‌నే అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.