Begin typing your search above and press return to search.

పోస్ట‌ర్ టాక్: అంగ వైకల్యాన్ని జ‌యించిన‌ అథ్లెట్ క‌థ‌

By:  Tupaki Desk   |   14 Dec 2019 7:54 AM GMT
పోస్ట‌ర్ టాక్: అంగ వైకల్యాన్ని జ‌యించిన‌ అథ్లెట్ క‌థ‌
X
తొలి నుంచి ఇమేజ్ కి దూరంగా ప్ర‌యోగాత్మ‌క క‌థాంశాల్ని ఎంచుకుని న‌టిస్తున్నాడు ఆది పినిశెట్టి. ప‌నిలో దిగితే ఇన్వాల్వ్ అయిపోవ‌డ‌మే! అంటూ ఆది చాలా ఇంట‌ర్వ్యూల్లో తెలుగు మీడియాకి చెప్పుకొచ్చారు. ఆ డెడికేష‌న్.. ఆ క‌సి అత‌డి న‌ట‌న‌లో కనిపిస్తుంద‌న‌డానికి రంగ‌స్థ‌లం.. గుండెల్లో గోదారి లాంటి చిత్రాల్లో అత‌డి పెర్ఫామెన్స్ చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ‌.

ఓవైపు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా.. మ‌రోవైపు హీరోగా అన్నివిధాలా త‌న‌ని తాను మ‌లుచుకుని క్ష‌ణం తీరిక లేని బిజీ ఆర్టిస్టుగా వెలుగుతున్నాడు. ప్ర‌స్తుతం ఆది పినిశెట్టి హీరోగా ఓ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతుంది. క్లాప్ అనేది టైటిల్. ది సౌండ్ ఆఫ్ స‌క్సెస్ ట్యాగ్ లైన్. తాజాగా రివీల్ చేసిన టైటిల్ లోనే చాలా వ‌ర‌కూ సస్పెన్స్ వీడింది. టైటిల్ కార్డ్ లో ఓ కృత్రిమ కాలును చూపించి హింట్ ఇవ్వ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

అయితే కృత్రిమంగా ఏర్పాటు చేసిన కాలితో ఎన్నో అద్భుతాలు చేసిన భ‌ర‌త‌నాట్య క‌ళాకారిణి -న‌టి సుధాచంద్ర‌న్ ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇంచుమించు అలాంటి ప్ర‌యోగ‌మే ఇది. ఈ చిత్రంలో క‌థానాయ‌కుడు కృత్రిమ కాలుతో ర‌న్నింగ్ రేస్ లో పాల్గొనే అథ్లెట్ గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. అంగ వైకల్యాన్ని జ‌యించిన అథ్లెట్ గా ఆది ఆకట్టుకోనున్నారని ఇప్ప‌టికే సమాచారం ఉంది. నేడు ఆది పుట్టిన‌రోజును పురస్కరించుకొని `క్లాప్` మోషన్ పోస్టర్ వీడియోని విడుదల చేశారు.

ఈ వీడియోకి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అల్టిమేట్. మ్యాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయ‌న మార్క్ ఈ మోష‌న్ పోస్ట‌ర్ సౌండింగ్ లో వినిపించింది. పృథ్వీ ఆదిత్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బిగ్ పిక్చర్స్- షిరిడీ సాయి పిక్చర్స్- సర్వాన్త్ రామ్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు - తమిళంలో ఏక కాలంలో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఇందులో ఆది స‌ర‌స‌న‌ ఆకాంక్ష సింగ్ క‌థానాయిక‌. వచ్చే ఏడాది వేసవి కానుకగా సినిమా విడుదల కానుంది.