Begin typing your search above and press return to search.

మొట్టమొదటి భారతీయ రీల్ లిప్పు లాకు!

By:  Tupaki Desk   |   19 May 2020 11:30 AM GMT
మొట్టమొదటి భారతీయ రీల్ లిప్పు లాకు!
X
ఇప్పుడంటే మన సినిమాల్లో లిప్ లాక్ లు చాలా కామన్ అయ్యాయి కానీ ఓ పదేళ్ళ క్రితం ఈ స్థాయిలో లేవు. ఓ ఇరవై ఏళ్ళ క్రితం అయితే లిప్ లాక్ అంటే చాలు ఔరా అని ఎవరైనా ముక్కు మీద వేలేసుకోవడం ఖాయం. ఈ లిప్ లాకుల దెబ్బకు సంప్రదాయవాదులు మాత్రం పూనకం వచ్చినట్టుగా ఊగిపోయేవారు. మరి ఓ 80 ఏళ్ళ క్రితం లిప్ లాక్.. అదీ ఇండియన్ స్క్రీన్ పై అంటే ఎవరికైనా షాక్ ఇస్తుంది.

'కర్మ' అనే టైటిల్ తో 1933 తెరకెక్కిన హిందీ సినిమాలో మొట్టమొదటి లిప్ లాక్ ను చిత్రీకరించారట. ఈ సినిమాలో హీరోయిన్ దేవిక తన నిజ జీవిత భర్త హిమాన్షు రాయ్ కి పెదవి ముద్దిచ్చి ఇండియాలో లిప్పు లాకుల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. అయితే అప్పట్లో ఈ కర్మ కిస్సుపై భారీ విమర్శలు చెలరేగాయట. అప్పట్లోనే లిప్ లాక్ అంటే హీరో హీరోయిన్ లు ఏ రేంజ్ డేరింగ్ & డాషింగ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు.

నిజానికి ఇమ్రాన్ హాష్మి లాంటి లాంటి ఈ తరం సీరియల్ కిస్సర్లకు.. ఇమ్రాన్ హష్మిని చూసి అదే పనిగా లిప్పు లాకులు లాగిస్తున్న మన హీరోలకు కూడా ఈ దేవిక - హిమాన్షు దేవుడు & దేవత. రోజూ ఓ కొబ్బరి కాయ కొట్టాలేమో!