Begin typing your search above and press return to search.

సూప‌ర్ స్టార్ కి మార్కెట్ తొలి పాఠం!

By:  Tupaki Desk   |   22 Nov 2019 6:17 AM GMT
సూప‌ర్ స్టార్ కి మార్కెట్ తొలి పాఠం!
X
స్టార్లు.. సూప‌ర్ స్టార్ల పారితోషికాలు ఆల్వేస్ హాట్ టాపిక్. అయితే ఇటీవ‌లి కాలంలో పారితోషికాల్లో లెక్క‌లు మారాయి. రిస్క్ నిర్మాత‌ల నుంచి తీసుకుంటున్నాం! అంటూ లాభాల్లో వాటాలు.. ఏరియాల హ‌క్కులు అడ‌గ‌డం అల‌వాటైంది. అయితే ఇందులోనూ లాజిక్ అప్ల‌య్! అంటూ హీరోలు వేస్తున్న స్కెచ్ మామూలుగా లేదు. అస‌లు థియేట్రిక‌ల్ క‌లెక్ష‌న్స్ కంటే ఇప్పుడు నాన్ థియేట్రిక‌ల్ ద్వారా వ‌చ్చే ప్యాకేజ్ మొత్తం ఆశావ‌హంగా ఉండ‌డంతో ఆ మొత్తాన్ని నిర్మాత‌కు ద‌క్క‌కుండా త‌మ ఖాతాల్లో ప‌డేలా హీరోలు జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. ``నాన్ థియేట్రిక‌ల్ రైట్స్`` మాకు ఇచ్చేయండి .. అదే మా పారితోషికం అంటూ హీరోలు మెలిక వేస్తుండ‌డంతో మొహ‌మాట‌స్తులైన నిర్మాత‌ల‌కు అది గిట్టుబాటు కాద‌ని తెలిసినా ఒప్పుకోక‌ త‌ప్ప‌డం లేదు.

అయితే నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ అనేవి హీరో రేంజును బ‌ట్టి మార్కెట్ ట్రెండును బ‌ట్టి ఎప్ప‌టిక‌ప్పుడు మారుతుంటుంది. స్టార్ డ‌మ్ కి త‌గ్గ‌ట్టు ఒక్కోసారి వ‌ర్క‌వుటైనా ఒక్కోసారి ఊహించ‌ని రీతిలో బ్యాక్ ఫుట్ వేస్తుంటుంది. అలా ఈసారి సూప‌ర్ స్టార్ మ‌హేష్ విసిరిన పాచిక పార‌లేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం అత‌డు న‌టిస్తున్న స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రానికి నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ త‌న‌కే చెందుతాయి అని మ‌హేష్ పారితోషికం లేకుండా ఒప్పందం చేసుకున్నార‌ట‌. జీఎంబీ బ్యాన‌ర్ లోగోని పోస్ట‌ర్ లో వేసింది ఎందుకంటే నాన్ థియేట్రిక‌ల్ రూపంలో వ‌చ్చేది త‌న‌దేన‌ని అర్థం అట‌.

డ‌బ్బింగ్.. శాటిలైట్.. డిజిట‌ల్ రైట్స్ మ‌హేష్ వాటా కింద‌కి వ‌స్తాయి ఒప్పందం ప్ర‌కారం. అయితే ఇప్ప‌టికే హిందీ డ‌బ్బింగు రైట్స్ లో ఆశించినంత రాలేదు. అంచ‌నాకు ఏడెనిమిది కోట్లు త‌గ్గింద‌ట‌. ఇత‌ర‌త్రా రైట్స్ లోనూ అంత బేరం ప‌ల‌క‌లేద‌ని తెలుస్తోంది. దీంతో మ‌హేష్ కి ద‌క్కుతుంద‌నుకున్న 50కోట్ల మినిమం ప్యాకేజ్ అంద‌కుండా పోతోంద‌ట‌. ఎంత తగ్గుతుంది? అన్న లెక్క‌లేవీ లేవు కానీ అందులో స‌గం అయితే గ్యారెంటీ ఉంద‌ట‌. ఇక దీనిని బ‌ట్టి మార్కెట్ హీరోల‌కు పాఠం నేర్పుతుంద‌ని ప్రూవైంది. ఒక ర‌కంగా హీరోలు ఇన్వాల్వ్ అవుతున్నారు కాబ‌ట్టి లాభ‌మైనా.. న‌ష్ట‌మైనా రిస్క్ త‌మ‌పై కొంత వేసుకున్న‌ట్టే. ఇక‌పోతే నిర్మాత గోడు ప‌రిశీలిస్తే వేరొక ర‌కంగా అటువైపు కూడా గిట్టుబాటు కావ‌డం లేద‌ట‌. థియేట‌ర్ల నుంచి క‌లెక్ష‌న్స్ స‌రిగా లేక‌పోవ‌డంతో పంపిణీదారుల‌కు న‌ష్టాలొస్తున్నాయి. తిరిగి వాటిలోంచి కొంత నిర్మాత‌నే పంపినీదారుల‌కు- బ‌య్య‌ర్ల‌కు గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. మ‌హేష్ తో స‌రిలేరు నిర్మాత అనీల్ సుంక‌ర ఒప్పందం ఏమిటి? అస‌లేం జ‌రుగుతోంది? అంటూ ట్రేడ్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది ఇప్పుడు.