Begin typing your search above and press return to search.

వీడియో: బాలయ్యతో బాహుబలి.. ఫస్ట్ గ్లింప్స్ అదిరింది!

By:  Tupaki Desk   |   14 Dec 2022 4:02 AM GMT
వీడియో: బాలయ్యతో బాహుబలి.. ఫస్ట్ గ్లింప్స్ అదిరింది!
X
నందమూరి బాలకృష్ణ ఆహా అన్ స్టాపబుల్ షోలోకి ప్రభాస్ వస్తున్నాడు అనగానే అభిమానుల్లో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాకుండా ప్రభాస్ ప్రాణ స్నేహితుడు గోపీచంద్ కూడా ఈ షోలోకి తోడుగా వస్తూ ఉండడంతో మరింత బజ్ పెరిగింది. అయితే ఈ షో ఎప్పుడు ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న సమయంలో ఆహా మరింత ఆతృతగ పెంచే విధంగా మరో గ్లింప్స్ అయితే వదిలేసింది.

బాహుబలి తో బాలయ్య బాబు అంటూ ఇంట్రడక్షన్ మాత్రం అదిరిపోయింది. ఇక ప్రభాస్ చాలా సింపుల్ గా షోలోకి అడుగు పెట్టి అందరికీ హాయ్ డార్లింగ్ అంటూ అవివాదాలు తెలిపేశాడు.

అంతేకాకుండా బాలకృష్ణను ప్రత్యేకంగా కౌగిలించుకొని నవ్వుతూ స్మైల్ ఇచ్చాడు. ఇక ఈ తర్వాత ఈ షోలో బాలయ్యతో ఆట మొదలైన తర్వాత ప్రభాస్ సిగ్గుపడుతూ మాట్లాడిన విధానం కూడా హైలెట్ అయినట్లుగా తెలుస్తోంది.

ఇక గోపీచంద్ తో అతను సరదాగా మాట్లాడిన మాటల్లో కూడా ఉన్నాయి. 'రేయ్ ఏం చెప్తున్నావు డార్లింగ్' అంటూ గోపీచంద్ ఏదో అన్నట్లుగా అనిపిస్తుంది. అంతేకాకుండా బాలయ్య ఏదో చేస్తూ ఉంటే ప్రభాస్ దూరం దూరంగా వెళుతూ ఉన్నాడు. ఇక గోపీచంద్ కూడా ప్రభాస్ కు సంబంధించి ఏదో విషయం చెబుతూ ఉంటే ప్రభాస్ అలిగినట్లుగా కూడా అనిపిస్తోంది.

మొత్తానికి ఈ ఫస్ట్ గ్లింప్స్ అయితే అదిరిపోయింది అనిపిస్తుంది. ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక అసలైన ప్రోమో త్వరలోనే విడుదల కాబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు.

ఫస్ట్ గ్లింప్స్ తోనే ఈ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసిన అన్ స్టాపబుల్ టీం ఇక ఫుల్ ఎపిసోడ్ తో ఎ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ ఎపిసోడ్ క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.