Begin typing your search above and press return to search.

ఫస్ట్ డే కలెక్షన్స్: భలేగుంది బాలా అనిపించిన 'శ్రీకారం'

By:  Tupaki Desk   |   12 March 2021 7:30 AM GMT
ఫస్ట్ డే కలెక్షన్స్: భలేగుంది బాలా అనిపించిన శ్రీకారం
X
యువ హీరో శర్వానంద్ నటించిన ''శ్రీకారం'' సినిమా శివరాత్రి కానుకగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా సందేశాత్మక అంశాలతో రూపొందిన ఈ సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్ళు రాబడుతోంది. శర్వానంద్ నటించిన గత రెండు సినిమాలు ప్లాప్ అవడంతో ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగలేదని తెలుస్తోంది. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే జోరు చూపించింది. మొత్తంగా ఈ సినిమా ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.01 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

'శ్రీకారం' సినిమా ఏరియా వైజ్ కలెక్షన్స్ వివరాలు చూసుకుంటే.. నైజాంలో - 1.10 కోట్లు.. సీడెడ్ - 75లక్షలు.. నెల్లూరు - 14 లక్షలు.. కృష్ణ - 25 లక్షలు.. గుంటూరు - 65 లక్షలు.. వైజాగ్ - 54 లక్షలు.. ఈస్ట్ - 30 లక్షలు.. వెస్ట్ - 28 లక్షలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక రాయలసీమ వంటి ప్రాంతాల్లో ఈ చిత్రానికి ఫస్ట్ డే శర్వా కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. నిన్న మార్నింగ్ షోస్ కన్నా ఈవెనింగ్ మరియు నైట్ షోల కలెక్షన్లు బాగా వచ్చాయి. తొలి రోజు 4.01 కోట్ల షేర్ రాబట్టిన 'శ్రీకారం' ఈ వీకెండ్ లో ఎలా నిలబడుతుందనేది చూడాలి.

కాగా, నూతన దర్శకుడు బి.కిశోర్ రెడ్డి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని 14-రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట - గోపీ ఆచంట కలసి నిర్మించారు. ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌ గా నటించింది. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చగా.. జె యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాసారు. 'శ్రీకారం' చిత్రంలో సీనియర్ నరేష్ - సాయికుమార్‌ - మురళి శర్మ - రావు రమేష్ - ఆమని - సత్య - సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.