Begin typing your search above and press return to search.

అసిస్టెంట్ గా ప‌ని చేసి డైరెక్ట‌ర్ అవుతుందా?

By:  Tupaki Desk   |   28 July 2021 5:00 AM GMT
అసిస్టెంట్ గా ప‌ని చేసి డైరెక్ట‌ర్ అవుతుందా?
X
కెమెరా వెన‌క ప‌ని చేసి కెమెరా ముందుకు వ‌చ్చేవాళ్లున్నారు. కానీ కెమెరా ముందు ప‌ని చేసి కెమెరా వెన‌క్కి వెళుతున్న‌వాళ్ల‌ను చూశారా? కానీ అలాంటి అరుదైన దృశ్యం ఇటీవ‌ల క‌నిపిస్తోంది. తాను అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా చేరి స‌డెన్ స‌ర్ ప్రైజ్ ఇచ్చింది తేజ‌స్వి మాదివాడ‌. ఈ బ్యూటీని ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ స‌డెన్ గా క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు నుంచి ప్ర‌మోట్ చేసి ఐస్ క్రీమ్ బ్యూటీగా మార్చారు. తొలి ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైనా ఆ త‌ర్వాత ప‌లు క్రేజీ లీడ్ పాత్ర‌ల్లో అవ‌కాశాలు అందుకుంది. కానీ ఈ లాక్ డౌన్ సీజ‌న్ లో అనుకున్న‌దొక్క‌టి అయిన‌దొక్క‌టి!

కార‌ణం ఏదైనా కానీ.. తేజ‌స్వి ఇప్పుడు రూట్ మార్చింది. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా అదృష్టం ప‌రీక్షించుకోనుంది. స‌హాయ న‌టిగా న‌టించే క్ర‌మంలోనే పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగులో తన ప్రదర్శనతో మెరిపించి ఫాలోయింగ్ పెంచుకున్న తేజ‌స్వి మాడివాడ ఇటీవల సోష‌ల్ మీడియాల్ని ఓ ఊపు ఊపుతున్న సంగ‌తి తెలిసిన‌దే. తన సున్నితమైన హాట్ ఫోటోషూట్లతో సినిమాల్లో బోల్డ్ పాత్రలతో మెరుపులు మెరిపిస్తోంది.

ప్రస్తుతం తేజూ రూట్ మార్చింది. ప్రముఖ నటుడు-దర్శకుడు అనీష్ కురువిల్లా దర్శకత్వ బృందంలో తేజ‌స్వి పనిచేస్తోంది. జీ 5 లో గాడ్స్ ఆఫ్ ధర్మపురి సిరీస్ ద‌ర్శ‌కుడిగా విమర్శకుల ప్రశంసలు పొందిన తరువాత అనీష్ ప్రస్తుతం ఒక కొత్త సిరీస్ ను తెర‌కెక్కిస్తున్నారు. తేజస్వి ద‌ర్శ‌క‌త్వ విభాగంలో అనుభ‌వం ఘ‌డించాక సినీవ్యాపారంలోనూ మెళ‌కువ‌లు నేర్చుకోవాల‌నుకుంటోంది. చూస్తుంటే ఇది త‌న సుదీర్ఘ ప్ర‌ణాళిక‌ల్లో భాగం అని అర్థం చేసుకోవ‌చ్చు. అంటే మునుముందు ద‌ర్శ‌కురాలిగా నిర్మాత‌గానూ టర్న్ అవ్వాల‌న్న పంతంతో ఇలా చేస్తోంద‌ని భావించ‌వ‌చ్చు. న‌టిగా ద‌ర్శ‌క‌నిర్మాత‌గా బ‌హుముఖ ప్ర‌జ్ఞ చూపించే స‌త్తా తేజ‌స్వికి ఉందంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు.