Begin typing your search above and press return to search.

బిల్లా రీ రిలీజ్.. థియేటర్ లో మంటలు..!

By:  Tupaki Desk   |   23 Oct 2022 9:39 AM GMT
బిల్లా రీ రిలీజ్.. థియేటర్ లో మంటలు..!
X
స్టార్ హీరోల సినిమాల రీ రిలీజ్ హంగామా ఏమో కానీ ఆ వాటి వల్ల అవి ప్రదర్శించబడుతున్న థియేటర్లకు కష్ట కాలం వచ్చించి. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బిల్లా సినిమా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో బిల్లా స్పెషల్ షో వేస్తున్నారు. తాడేపల్లిగూడెం లో వెంకట్రామా థియేటర్ లో బిల్లా స్పెషల్ షో వేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ కోలాహలంతో థియేటర్ హౌజ్ ఫుల్ అయ్యింది. ఇదే అత్యుత్సాహంలో కొందరు థియేటర్ లో సీట్ల మీద బాణాసంచా కాల్చారు.. దాని వల్ల సీట్లు కాలిపోగా.. థియేటర్ లో కూడా ఒక్కసారిగా మంటలు ఏర్పడ్డాయి.

సీట్లు మొత్తం ఒకదాని వెంట ఒకటి కాలుతూ థియేటర్ మొత్తం పొగ వ్యాపించింది. ఈ సంఘటన జరగడంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఫ్యాన్స్ స్పెషల్ షోస్ ఎంజాయ్ మెంట్ బాగానే ఉన్నా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే ఇబ్బంది పడాల్సి వస్తుంది. హీరోల బర్త్ డే లకు వారి పాత సూపర్ హిట్ సినిమాలు స్పెషల్ షోస్ వేయడం సెంటిమెంట్ గా మారింది. మహేష్ పోకిరి సినిమాతో మొదలైన ఈ స్పెషల్ షో మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా కూడా జల్సా రీ రిలీజ్ చేయగా ఆ సినిమా టైం లో కూడా ఒకచోట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్ ధ్వంసం చేశారు. అక్కడ సౌండ్ సరిగా రావట్లేదని పెంచమంటే థియేటర్ యాజమాన్యం సరిగా స్పందించలేదని థియేటర్ ధ్వంసం చేశారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

ఈ రిలీజ్ హంగామా ఎలా ఉంది అంటే స్టార్స్ చేస్తున్న కొత్త సినిమా రిలీజ్ డే నాడు ఉన్న హడావిడిలా ఉంది. అభిమాన హీరో ఓల్డ్ సూపర్ హిట్ మూవీ మళ్లీ వెండితెర మీద చూడాలన్న కోరిక బాగుంది కానీ దాని వల్ల థియేటర్ ధ్వంసం అవడం లాంటి సంఘటనలే హీరోలకి తలనొప్పిగా మారుతుంది. ప్రభాస్ సినిమా వల్ల జరిగిన ఈ నష్టాన్ని ఆ హీరో భరిస్తాడా లేక ఆ అభిమానులు భరిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.