Begin typing your search above and press return to search.
అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం.. పక్కనే బిగ్ బాస్ హౌస్
By: Tupaki Desk | 16 Oct 2020 1:00 PM ISTప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. షూటింగ్ కోసం వేసిన సెట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణం గా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అయితే ఉదయం అవడం వల్ల అక్కడ ఎవరూ లేక పోవడం తో ప్రాణనష్టం జరగలేదు. అంతేకాకుండా అగ్నిమాపక సిబ్బంది సత్వరమే స్పందించి మంటలను ఆర్పివేయడం తో ఆస్తి నష్టం కూడా జరగ లేదని యాజమాన్యం తెలిపింది.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్టూడియో యాజమాన్యం తెలిపింది. ఓ మూవీ షూటింగ్ కోసం వేసిన సెట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదని తెలుస్తోంది.
అయితే అన్నపూర్ణ స్టూడియోలో ఇలాంటి ప్రమాదాలు జరగడం మొదటిసారి కాదు. గతంలో చాలా సార్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా అనేక రకాలుగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇక బిగ్ బాస్ హౌజ్ కూడా ఘటన జరిగిన సమీపంలోనే అంది. అయితే బిగ్ బాస్ హౌజ్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదని కూడా నిర్వాహకులు తెలిపారు.