Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో అగ్ని ప్రమాదం

By:  Tupaki Desk   |   20 Nov 2021 2:41 PM GMT
బ్రేకింగ్: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో అగ్ని ప్రమాదం
X
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆమె నివాసం ఉండే భవనంలో మంటలు అంటుకున్నాయి. ముంబైలోని ఈ బిల్డింగ్ లో 12వ అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు.

విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో రకుల్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా మంటలు రాజుకోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకూ తెలియరాలేదు.

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్.. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు సీక్రెట్ గా లవ్ లో ఉన్న ఈ భామ తన ప్రేమ విషయాన్ని బర్త్ డే రోజున అధికారికంగా ప్రకటించి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. జాకీ ఈ ఏడాది తనకు దక్కిన పెద్ద బహుమతిగా పేర్కొంది.