Begin typing your search above and press return to search.
మీటూ : ఎవరూ లేని ప్లాట్ కు తీసుకు వెళ్లి..!
By: Tupaki Desk | 22 Nov 2018 12:30 PM ISTబాలీవుడ్ లో మీటూ అంటూ ఇంకా మహిళలు లైంగిక వేదింపుల ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది సెలబ్రెటీల బతుకులు రోడ్డున పడ్డాయి. లైంగిక వేదింపుల ఆరోపణల వల్ల ఎంతో మంది అవకాశాలు కోల్పోయారు. తాజాగా కాస్టింగ్ డైరెక్టర్ విక్కీ సిదానపై కూడా లైంగిక వేదింపుల ఆరోపణలు వచ్చాయి. విక్కీ కి బాలీవుడ్ లో మంచి పేరు ఉంది. స్టార్స్ తో మంచి సన్నిహిత్యం ఉన్న విక్కీపై నటి కార్తీక శర్మ మీటూ ఆరోపణలు చేయడంతో ఇప్పుడు ఆయన పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
నటి కార్తీక శర్మ తాజాగా మీటూ ఉద్యమంలో భాగంగా స్పందిస్తూ... తనను ఆరు సంవత్సరాల క్రితం విక్కీ సిదాన లైంగికంగా వేదించాడు. ఒకసారి దిల్లీలో పరిచయం అయిన విక్కీతో స్నేహం కొనసాగించాను. ఒకసారి ముంబయిలో ఉండవల్సి రావడంతో ఆయన ఇంట్లో ఉన్నాను. ఆయన భార్య ఉండటం వల్ల ఏ భయం లేకుండా ఉండవచ్చు అనుకున్నాను. ఆ సమయంలోనే నన్ను ఒక ఖాళీగా ఉన్న అపార్ట్ మెంట్ ప్లాట్ కు తీసుకు వెళ్లాడు. అక్కడ నాతో మిస్ బిహేవ్ చేశాడు. నన్ను బలవంతం చేసేందుకు ప్రయత్నించాడు.
ఆరు సంవత్సరాల క్రితమే ఈ విషయం గురించి కార్తీక శర్మ మీడియా ముందు చెప్పుకొచ్చింది. అప్పట్లో విక్కీ సిదాన ఆమె ఆరోపణలను కొట్టి పారేశాడు. తాజాగా మరోసారి విక్కీని టార్గెట్ చేసి కార్తీక శర్మ ఆరోపణలు చేయడంతో పాటు కేసు కూడా పెట్టింది. కేసు బుక్ అవ్వడంతో మరోసారి విక్కీ సిదాన సోషల్ మీడియా ద్వారా ఆమె ఆరోపణలను కొట్టి పారేశాడు. లైంగిక వేదింపులు ఎదుర్కొంటున్న విక్కీ సిదానతో వర్క్ చేసేందుకు బాలీవుడ్ ప్రముఖులు ఆసక్తి చూపడం లేదు.