Begin typing your search above and press return to search.

బాధపెట్టి ఉంటే క్షమించండి

By:  Tupaki Desk   |   19 Jan 2021 9:15 AM IST
బాధపెట్టి ఉంటే క్షమించండి
X
దేశ రాజకీయాలను టార్గెట్‌ చేసి రూపొందించిన 'తాండవ్‌' వెబ్‌ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చినప్పటి నుండి విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడైతే స్ట్రీమింగ్‌ ప్రారంభం అయ్యిందో అప్పటి నుండి వివాదం మరింత పెరిగింది. హిందువుల మనో భావాలను దెబ్బ తీసే విధంగా వెబ్‌ సిరీస్ లో పలు సీన్స్ ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాండవ్ నుండి ఆ సీన్స్‌ ను తొలగించడంతో పాటు వెంటనే క్షమాపణ చెప్పకుంటే పరిణామాలు సీరియస్ గా ఉంటాయంటూ బీజేపీ మరియు శివసేన కార్యకర్తలు తాండవ్‌ యూనిట్‌ సభ్యులను హెచ్చరించారు. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది.

వివాదం ముదురుతున్న నేపథ్యంలో కేంద్ర సమాచార శాఖ రంగంలోకి దిగింది. అమెజాన్‌ ప్రైమ్‌ వారితో చర్చలు జరపడంతో పాటు మనోభావాలు కించపర్చే కంటెంట్‌ ను సహించేది లేదు అంటూ హెచ్చరించడం జరిగింది. దాంతో ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ వారు క్షమాపణ చెప్పడంతో పాటు వివాదాస్పదంగా ఉన్న సీన్స్‌ ను తొలగించేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే ఓటీటీ కి సెన్సార్‌ ఉండాలని చాలా మంది డిమాండ్‌ చేస్తున్నారు. తాండవ్ ఇష్యూతో సెన్సార్‌ విషయమై కేంద్రం మరింతగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాండవ్‌ వివాదం క్షమాపణ చెప్పడంతో ముగిసినట్లయ్యింది. ముందు ముందు జాగ్రత్తగా ఉండకుంటే మరిన్ని వివాదాలు వచ్చే అవకాశం లేకపోలేదు.