Begin typing your search above and press return to search.

మీటు వివాదంలో మరో ప్రముఖ నటుడు !

By:  Tupaki Desk   |   12 Feb 2020 10:16 PM IST
మీటు వివాదంలో మరో ప్రముఖ నటుడు !
X
బుల్లితెర , వెండితెర అన్న తేడా లేకుండా మహిళలని కొందరు లైంగికంగా వేధిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఉన్నవారందరూ అలాంటివారే కాకపోయినా , ఇండస్ట్రీలో అలాంటివారు కూడా ఉన్నారు. గత కొన్ని రోజుల క్రితం మీటు అంటూ ప్రతి ఒక్కరు కూడా బయటకి వచ్చి తమకి జరిగిన అన్యాయాల్ని చెప్పుకున్నారు. ఇప్పటికి కూడా కొంతమంది తమ జరిగిన అన్యాయాల్ని బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ యువతి ని లైంగిక వేధించినట్లు ఫిర్యాదు రావడం తో ప్రముఖ చిత్ర, టీవీ నటుడు షాబాజ్‌ ఖాన్‌ పై లైంగిక వేధింపుల కేసును నమోదు చేసినట్టు తెలుస్తుంది.

ముంబైలోని ఓషివారా పోలీసు స్టేషన్‌ లో ఆయనపై ఐపీసీ సెక్షన్‌ 354, 509 కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుధవారం పోలీసులు వెల్లడించారు. కాగా ఈ కేసు దర్యాప్తులో ఉన్నందున ఆయనపై ఇంకా ఇప్పటి వరకు ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. ఇకపోతే , ఇక పలు హిందీ సీరియల్‌ లో ప్రతి నాయకుడి పాత్రల్లో నటించి విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న షాబాజ్‌ ఖాన్‌ అసలు పేరు హైదర్‌ ఖాన్‌. శాస్త్రీయ గాయకుడిగా పద్మభూషన్‌ ఆవార్డును గెలుచుకున్న ఉస్తాద్‌ మీర్‌ ఖాన్‌ కుమారుడు. షాబాజ్‌ తెనాలి రామా, రామా సియా కే లవ్‌ కుష్‌, సలామ్‌ అలీ ఖాన్‌.. వంటి హిందీ సిరియళ్లతో పాటు వెండి తెరపై కూడా ప్రతి నాయకుడి పాత్రల్లో నటించి బాగా పాపులర్‌ అయ్యాడు.