Begin typing your search above and press return to search.
హాలీవుడ్ చేప మళ్లీ ఎటాకిస్తోంది
By: Tupaki Desk | 17 Jun 2016 10:15 AM ISTఈ సీజన్ లో బాలీవుడ్డోళ్లకైనా.. వేరే ఇతర వుడ్డోళ్ళకైనా.. హాలీవుడ్ పేరు చెబితే అరెకరం తడిసిపోయింది అంతే. మన సినిమాలు ఆడని పక్షంలో వాళ్ళ సినిమాలు ఇక్కడ ఎలా దంచుకుంటాయో ఒక షో వేసి చూపించారు మనకి. 100 కోట్ల మార్కును సునాయసంగా క్రాస్ చేసిన జంగిల్ బుక్ అయినా.. లేదంటే కుంగ్ ఫూ పాండా 3 అయినా.. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఆడుతున్న కాంజూరింగ్ 2 అయినా కూడా.. హాలీవుడ్ సినిమాలన్నీ ఇండియాలో హాట్ కేకుల్లా క్లిక్ అయిపోతున్నాయి. ఇక పిల్లలను ఆకట్టుకునే కంటెంట్ మాత్రం.. రిజల్టు రయ్ అంటూ పరిగెత్తేస్తోంది.
ఈ శుక్రవారం ఇండియాలో రిలీజవుతోంది.. ఏకంగా పిల్లలకు ఎంతో ఇష్టమైన చేపల సినిమా. అప్పట్లో వచ్చిన ''ఫైండింగ్ నెమో'' సినిమా ఉంది చూశారూ.. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. డిస్నీ కంపెనీ వారు 2003లో ‘ఫైండింగ్ నెమో’ సినిమాతో ఇండియాలో సూపర్ హిట్టు కొట్టారు. చాలాకాలం పాటు మన హైదరాబాద్ ఐమ్యాక్స్ లార్జ్ స్ర్కీన్ పై ఈ సినిమాను ప్రదర్శించారు కూడా. సముద్రంలోని ఓ చేపల ఫ్యామిలీ నుంచి తప్పిపోయిన నెమో అనే చేప కోసం వెతకడమే ఆ సినిమా కథ. 94 మిలియన్ డాలర్లతో రూపొందిస్తే.. 935 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘ఫైండింగ్ డోరీ’ని ఇప్పుడు 200 మిలియన్ డాలర్లతో తీశారు. ఈసారి డోరి తప్పిపోయే కథ. కాస్త కనెక్ట్ అయితే చాలు.. ఈ ఎటాక్ మరోసారి మన సినిమాల ఫేట్ ను తారుమారు చేసే సీనుంది.