Begin typing your search above and press return to search.

బన్నీ, జూనియర్ లపై కన్నేశాడు

By:  Tupaki Desk   |   26 Feb 2016 1:55 PM GMT
బన్నీ, జూనియర్ లపై కన్నేశాడు
X
కోలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకడైన విశాల్.. లింగుస్వామితో పందెంకోడి2 ప్రాజెక్ట్ రద్దు అయినట్లు ప్రకటించాడు. దీంతో యాక్షన్ చిత్రాలను తెరకెక్కించడంలో పర్ఫెక్ట్ అని గుర్తింపు పొందిన లింగు స్వామి.. నెక్ట్స్ ప్రాజెక్ట్ ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టేశాడు. తన తర్వాతి వెంచర్ ని తెలుగు-తమిళ్ లో ద్విభాషా చిత్రం తీయాలన్నది ఈ దర్శకుడి ఆలోచన. ఇందుకోసం గతేడాది నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ లను కలిశాడు కూడా. ఈ ఇద్దరికీ తగిన స్క్రిప్టులు ఉన్నాయని లింగుస్వామి సన్నిహితులు అంటున్నారు. 'బన్నీ, ఎన్టీఆర్ లతో చెరో ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు లింగుస్వామి. ఎన్టీఆర్ అయితే సినిమా చేసేందుకు ఉత్సాహంగానే ఉన్నాడు. కానీ ప్రస్తుతం కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండడంతో ఇంకా ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదు' అని దర్శకుడి సన్నిహితులు అంటున్నారు.

ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం అల్లు అర్జున్ కూడా లింగుస్వామితో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే తెలుస్తోంది. సరైనోడు సినిమా త్వరలోనే పూర్తి కానుండడంతో.. ఇది కంప్లీట్ కాగానే లింగుస్వామి ప్రాజెక్టుపై ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ఇప్పుడే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడంతో.. జూనియర్-లింగుస్వామిల కాంబినేషన్ సెట్ అయేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.