Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు మరో టాలీవుడ్ మూవీకి శ్రీవల్లి కన్ఫర్మ్‌

By:  Tupaki Desk   |   13 Jan 2023 7:30 AM GMT
ఎట్టకేలకు మరో టాలీవుడ్ మూవీకి శ్రీవల్లి కన్ఫర్మ్‌
X
తెలుగు తో పాటు తమిళం మరియు హిందీలో కూడా వరుసగా సినిమాలు చేసిన ముద్దుగుమ్మ రష్మిక మందన్నా ఈ మధ్య ఒక్కసారిగా స్లో అయ్యింది. తమిళంలో ఈమె నటించిన వారిసు సినిమా తాజాగా విడుదల అయ్యింది. హిందీలో ఈమె యానిమల్ సినిమాలో నటిస్తోంది. తెలుగు లో పుష్ప 2 లో మాత్రమే నటిస్తోంది. కొన్ని సినిమాలు చర్చలు జరుగుతున్నా ఇన్నాళ్లు కన్ఫర్మ్‌ అవ్వలేదు.

ఎట్టకేలకు పుష్ప 2 తో పాటు తెలుగు లో మరో సినిమాను ఈమె కన్ఫర్మ్‌ చేసింది. నితిన్ తో ఈమె మరో సినిమాను చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

వీరిద్దరి కాంబోలో గతంలో భీష్మ సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

భీష్మ సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరు కలిసి నటించబోతున్నారు. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఆ సినిమా చిత్రీకరణ పూర్తి అవ్వక ముందే వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

నితిన్‌.. రష్మిక మందన్నా.. వెంకీ కుడుముల మరోసారి భీష్మ సినిమా తర్వాత కలిసి పని చేయబోతున్నారు. ఈ విషయం అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి.

తెలుగు లో రష్మిక పుష్ప 2 కాకుండా ఎట్టకేలకు నితిన్ తో జోడీగా నటించేందుకు కమిట్ అయ్యింది. ముందు ముందు మరిన్ని తెలుగు సినిమాల్లో ఈమె నటిస్తుందేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.