Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు మరో శివగామి వచ్చింది

By:  Tupaki Desk   |   17 Dec 2019 5:35 AM GMT
ఎట్టకేలకు మరో శివగామి వచ్చింది
X
హీరోయిన్‌ గా సౌత్‌ సినీ ఇండస్ట్రీలో దాదాపు దశాబ్ద కాలంగా వెలుగు వెలిగిన రమ్యకృష్ణ ఎంతో మంది స్టార్‌ హీరోలతో రొమాంటిక్‌ పాత్రలు చేసి మెప్పించింది. హీరోలతో ఒకప్పుడు రొమాన్స్‌ చేసి అలరించిన రమ్యకృష్ణ ఇప్పుడు తన నటనతో అప్పియరెన్స్‌ తో మెప్పిస్తోంది. బాహుబలి సినిమాలో శివగామి పాత్రతో రమ్యకృష్ణ మళ్లీ బిజీ అయ్యింది. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రమ్యకృష్ణ ఏ స్థాయిలో బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాని వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా శివగామి స్థాయి పాత్రను మాత్రం ఆమె దక్కించుకోలేక పోతుంది.

సినిమాల్లో శివగామి తరహా పాత్రలు చేయాలని ఆమె చాలా ఆశ పడుతుంది. కాని దర్శకులు ఎవరు కూడా ఆమెకు ప్రముఖ పాత్రను ఇవ్వడం లేదు. కాని వెబ్‌ సిరీస్‌ లో రమ్యకృష్ణ మరోసారి తన సత్తా చాటింది. బాహుబలి సినిమాలో శివగామిగా ఎంతగా అలరించి ఆకట్టుకుందో ఇప్పుడు క్వీన్‌ వెబ్‌ సిరీస్‌ ద్వారా కూడా అంతే మొత్తంలో అలరిస్తూ ఉంది. జయలలిత బయోపిక్‌ అయిన క్వీన్‌ వెబ్‌ సిరీస్‌ లో రమ్యకృష్ణ చేసిన నటనకు విమర్శకుల ప్రశంసలు కురుస్తున్నాయి.

చాలా గంభీరంగా జయలలిత బాడీ లాంగ్వేజ్‌ ను అనుసరిస్తూ రమ్యకృష్ణ చేసిన నటన ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది. ప్రస్తుతం ఆన్‌ లైన్‌ లో స్ట్రీమింగ్‌ అవుతున్న క్వీన్‌ సినిమాను జనాలు విపరీతంగా చూస్తున్నారు. బాహుబలి వచ్చిన చాలా ఏళ్లకు మళ్లీ శివగామి స్థాయి పాత్రను రమ్యకృష్ణ చేసింది అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జయలలిత బయోపిక్‌ కు రమ్యకృష్ణ అద్బుతంగా సూట్‌ అయ్యిందని.. ఈమెతోనే సినిమా చేస్తే బాగుండేది అంటూ కొందరు అంటున్నారు. బుల్లి తెరపై అయినా రమ్యకృష్ణ మరోసారి శివగామి స్థాయిలో కనిపించడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.