Begin typing your search above and press return to search.

యువ హీరో కెరీర్ పై 'ఫైనల్ సెటిల్మెంట్' ఎఫెక్ట్ పడుతుందా..?

By:  Tupaki Desk   |   28 April 2021 5:31 AM GMT
యువ హీరో కెరీర్ పై ఫైనల్ సెటిల్మెంట్ ఎఫెక్ట్ పడుతుందా..?
X
'ప్రేమతో మీ కార్తీక్' అనే సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ.. 'Rx 100' మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. దీంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన యువ హీరో 'హిప్పీ' 'గుణ 369' '90 ML' వంటి సినిమాలు చేసాడు. ఇటీవలే అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌ లో చేసిన 'చావు కబురు చల్లగా' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా థియేటర్స్ లో నిరాశపరిచినప్పటికీ, 'ఆహా' ఓటీటీలో పర్వాలేదనిపిస్తోంది. ఫలితం ఎలా ఉన్నా గీతా ఆర్ట్స్ వంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో సినిమా చేయడం కార్తీకేయ కెరీర్ కు బాగానే ఉపయోగపడింది. అందుకే స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తూ తన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో కార్తీకేయ తో సినిమా చేస్తున్నాడు. దీంతో యువ హీరో కెరీర్ గాడిలో పడుతుందని అందరూ అనుకుంటుండగా.. ఇప్పుడు కార్తికేయ నటించిన ఓ సినిమా కెరీర్ కు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

కార్తికేయ అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో 'ఫైనల్ సెటిల్మెంట్' అనే ఓ సినిమా చేసాడు. అనేక కారణాలతో ఈ సినిమా బయటకు రాలేదు. జమ్మలమడుగు మోహన్ కాంత్ స్వీయనిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని తెలుస్తోంది. అయితే కార్తికేయ అలాంటి ఒక సినిమాలో నటించాడని తెలియని వాళ్ళు నిన్న 'ఫైనల్ సెటిల్మెంట్' ఫస్ట్ లుక్ చూసి షాక్ అయ్యారు. సినిమా సినిమాకు కష్టపడుతూ ఫిజిక్ ని డెవలప్ చేసుకుంటూ వచ్చిన కార్తికేయ.. ఇందులో బక్కచిక్కిపోయి కనిపించాడు. దీంతో ఇప్పుడిప్పుడే కెరీర్ ని పక్కా గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్న హీరోకు.. 'ఫైనల్ సెటిల్ మెంట్' ప్రతికూలంగా మారుతుందేమో అని అందరూ ఆలోచిస్తున్నారు. ఇండస్ట్రీలో చాలా మంది హీరో హీరోయిన్లకు ఇలాంటి సమస్యలే వచ్చాయి. ఆఫర్స్ కోసం తిరుగున్న రోజుల్లో కమిటై చేసిన సినిమాలు వాళ్లకు క్రేజ్ వచ్చిన తర్వాత రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ నటించిన 'ఏ మంత్రం వేశావే' అనే సినిమా కూడా ఇలానే విడుదలైంది. కాకపోతే ఈ సినిమా విజయ్ కెరీర్ కి మైనస్ గా మారలేదు. మరి ఇప్పుడు కార్తికేయ గత చిత్రం ఆయన కెరీర్ పై ప్రభావం చూపిస్తుందేమో చూడాలి.