Begin typing your search above and press return to search.

వినాయక చవితికి తెలుగు ప్రేక్షకులను అలరించబోయే చిత్రాలివే..!

By:  Tupaki Desk   |   30 Aug 2021 9:52 AM GMT
వినాయక చవితికి తెలుగు ప్రేక్షకులను అలరించబోయే చిత్రాలివే..!
X
తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి థియేటర్లు - ఓటీటీలు పోటీ పడుతున్నాయి. ఓవైపు థియేటర్లలో చిన్న చిత్రాలు రిలీజ్ అవుతుంటే.. మరోవైపు డిజిటల్ వేదికలు సినిమాలు - వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కి పెడుతున్నాయి. కోవిడ్ నేపథ్యంలో పుంజుకున్న ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్.. ఇప్పుడు కూడా అదే హవా ని కొనసాగించడానికి ట్రై చేస్తున్నాయి. రాబోయే వినాయక చవితి పండుగను క్యాష్ చేసుకోడానికి ఫ్రెష్ కంటెంట్ ని ఆడియన్స్ కి అందించడానికి ఓటీటీలు రెడీ అవుతున్నాయి.

సెప్టెంబర్ 10వ తేదీన నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'టక్ జగదీష్' చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ విధానంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయనున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌ పై సాహు గార‌పాటి - హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో నాని సరసన రీతూవర్మ - ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్లుగా నటించారు. ఫెస్టివల్ సీజన్ లో కుటుంబం అంతా కలిసి చూడగలిగే పర్ఫెఫ్ట్ సినిమా ఇదని చిత్ర యూనిట్ చెబుతోంది.

తెలుగు ఓటీటీ 'ఆహా' ఈ గణేష్ చతుర్ధశికి రెండు వెబ్ సిరీస్ లను సిద్ధం చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్ రూపొందించిన 'ది బేకర్ మరియు ది బ్యూటీ' అనే ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌ ని సెప్టెంబర్ 10న స్ట్రీమింగ్ కి పెడుతున్నారు. ఈ రొమాంటిక్ డ్రామాలో 'ఏక్ మినీ కథ' ఫేమ్ సంతోష్ శోభన్ - టీనా శిల్ప‌రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. జొనాథ‌న్ ఎడ్వ‌ర్డ్స్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ పది ఎపిసోడ్స్ గా అందుబాటులోకి రానుంది. అలానే 'మహా గణేశ' అనే యానిమేటెడ్ ఒరిజినల్ ని ఆహా రిలీజ్ చేస్తోంది. ఇది చిన్న పిల్లలకు కావాల్సినంత వినోదాన్ని అందించే అవకాశం ఉంది.

అవికా గోర్ - రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందిన 'నెట్' అనే సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ జీ5 ఓటీటీలో ఈ వినాయక చవితికి స్ట్రీమింగ్ కాబోతోంది. వాస్తవిక సంఘటనల ఆధారంగా భార్గవ్ మాచర్ల ఈ సిరీస్ ని సిద్ధం చేసాడు. వీటితో పాటుగా మరికొన్ని తెలుగు డబ్బింగ్ సిరీస్ లు కూడా ప్రసారం కానున్నాయి. అయితే సెప్టెంబర్ 10న రిలీజ్ అయ్యే ఓటీటీ కంటెంట్ లో 'టక్ జగదీష్' సినిమా ఒక్కటే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి వీటిలో ఏవేవి తెలుగు ప్రేక్షకులను అలరిస్తాయో చూడాలి.

ఇక థియేట్రికల్ రిలీజులు విషయానికొస్తే.. సెప్టెంబర్ 10న యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన 'సీటీమార్' సినిమా విడుదల కానుంది. సంపత్‌ నంది రూపొందించిన ఈ స్పోర్ట్స్‌ డ్రామాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. భూమిక - దిగంగనా సూర్యవంశీ కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కబడ్డీ క్రీడ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు.

బాలీవుడ్ కభామ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ''తలైవి'' కూడా వినాయక చవితికి థియేటర్లలోకి రానుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఎ.ఎల్. విజయ్ దీనికి దర్శకత్వం వహించారు. విబ్రి మోషన్ పిక్చర్స్ - కర్మ మీడియా ఎంటర్టైన్మెంట్ పతాకాలపై విష్ణువర్థన్ ఇందూరి - శైలేష్ ఆర్. సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ వారంలో సెప్టెంబర్ 10న రాబోయే మరికొన్ని సినిమాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.