Begin typing your search above and press return to search.

జయంతి స్పెష‌ల్: మ‌హాత్మ గాంధీజీపై సినిమాలివే..

By:  Tupaki Desk   |   2 Oct 2020 2:40 PM IST
జయంతి స్పెష‌ల్: మ‌హాత్మ గాంధీజీపై సినిమాలివే..
X
నేడు (02 అక్టోబ‌ర్ 2020) మ‌హాత్మ‌ గాంధీ జ‌యంతి. భ‌ర‌త జాతి దాస్య‌సృంఖ‌లాల్ని తెంచిన మ‌హ‌నీయుడు మోహ‌న్ దాస్ క‌ర‌మ్‌చంద్ గాంధీ. అహింసా మార్టంలో తెల్ల‌వాడికి చుక్క‌లు చూపించి జాతిపిత‌గా కోట్లాది భార‌తీయుల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయారు. ఆయ‌న‌కు రంగుల ప్ర‌పంచంతో సంబంధ‌మేమిటి? అంటే.. సినీవినీలాకాశంలో మ‌హాత్ముడిపై వ‌చ్చిన చిత్రాలు చాలానే వున్నాయి. అందులో చాలా వ‌ర‌కు విజ‌యాల్ని ద‌క్కించుకోవ‌డంతో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని కూడా పొందాయి. వాటిలో కొన్ని చిత్రాలు గురించి మ‌రోసారి ఓ లుక్కేద్దాం.

ఆయ‌న భావాల స్ఫూర్తితో ఇండియ‌న్ స్క్నీన్ పై దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో ఎన్నో చిత్రాలొచ్చాయి. హేరామ్ నుంచి ల‌గే ర‌హో మున్నాభాయ్ వ‌ర‌కు ఎన్నో స్ఫూర్తి వంత‌మైన చిత్రాల్ని మ‌న మేక‌ర్స్ అందించారు. అందులో దిబెస్ట్ గా నిలిచిన చిత్రాలు ప‌రిమిత‌మే‌. అందులో గాంధీ జీవిత క‌థ ఆధారంగా వ‌చ్చిన `గాంధీ` చిత్రం ఒక‌టి ది బెస్ట్ అన్న టాక్ వ‌చ్చింది. 1982లో వ‌చ్చిన ఈ చిత్రంలో గాంధీగా హాలీవుడ్ న‌టుడు బెన్ ‌కింగ్ ‌స్లే గొప్ప‌గా న‌టించారు. రిచ‌ర్డ్ అటెన్ ‌బ‌రో రూపొందించిన ఈ చిత్రం సంచ‌ల‌నం సృష్టించింది.

ఆ త‌రువాత `ది మేకింగ్ ఆఫ్ మ‌హాత్మ` (1996) వ‌చ్చింది. ప్ర‌ఖ్యాత బెంగాలీ ద‌ర్శ‌కుడు శ్యామ్ ‌బెనెగ‌ల్ ఈ చిత్రాన్ని రూపొందించారు. సౌత్ ఆఫ్రీకాలో గాంధీ వున్న నాటి రోజుల నేప్యంలో దీన్ని న‌డిపించారు. ఆయ‌న అహింసామార్గాన్ని ఎలా ఎంచుకున్నారు. దానికి నాందీ ప్ర‌స్థావ‌న ఎక్క‌డ ఎలా జ‌రిగింది అన్న‌దాన్ని ఈ చిత్రంలో ప్ర‌ధానంగా చ‌ర్చించారు. 2000 సంవ‌త్స‌రంలో క‌మ‌ల్ హాస‌న్‌,... షారుక్ ఖాన్‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన వివాదాస్ప‌ద‌ చిత్రం `హేరామ్‌`. మ‌హాత్మాగాంధీని నాథూరామ్ గాడ్సే చంపిన నేప‌థ్యంతో పాటు భార‌త్ పాకిస్థాన్ విడిపోయిన ఉదంతం నేప‌థ్యంలో తెర‌కెక్కించారు. షారుక్ ఖాన్ ఇందులో అంజాద్ అలీఖాన్ గా అతిథి పాత్ర‌లో క‌నిపించారు.

ఆ త‌రువాత అనుప‌మ్ ‌ఖేర్ చేసిన చిత్రం `మైనే గాంధీకో న‌హీమారా`. ఈ చిత్రం 2005లో వ‌చ్చింది. ఓ హిందీ ప్రొఫెసర్ త‌నే గాంధీని చంపాన‌ని ఫీల‌య్యే సైక‌లాజిక‌ల్ డ్రామా నేప‌థ్యంలో ఈ మూవీని తీశారు. ఉర్మిళ మంటోడ్క‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో గాంధీ గురించి పెద్ద‌గా ప్ర‌స్థావ‌న లేక‌పోయినా గాంధీపై వ‌చ్చిన సినిమా ఇది. ఇందులో సైక‌లాజిక‌ల్ డిజార్డ‌ర్ ‌తో బాధ‌ప‌డే హిందీ ‌ప్రొఫెస‌ర్ గా అనుప‌మ్ ‌ఖేర్ ఈ పాత్ర‌ని అత్య‌ద్భుతంగా పోషించిన తీరుకు జాతీయ స్థాయిలో ప్ర‌శంస‌లు ల‌భించాయి. 2006లో గాంధీగిరి నేప‌థ్యంలో అత్య‌ద్భుత‌మైన సందేశంతో వ‌చ్చిన చిత్రం `మున్నాభాయ్ ఎంబీబీఎస్‌`. సంజ‌య్ ద‌త్ ‌కున్న బ్యాడ్ మెన్ ఇమేజ్ ని పూర్తిగా తొల‌గించిన చిత్ర‌మిది. రాజ్‌కుమార్ హిరాణీ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు ప్రామాణికంగా నిలిచింది. ఆ త‌రువాత వ‌చ్చిన `ల‌గేర‌హో మున్నాభాయ్`లోనూ గాంధీగిరి గురించి ప్ర‌స్థావించారు. ఇక గాంధీ ఎమోష‌న‌ల్ డ్రామాగా `గాంధీ మై ఫాద‌ర్‌` వ‌చ్చింది. ఇక కృష్ణ‌వంశీ `మ‌హాత్మ‌` పేరుతో ఓల్డ్ సిటీ నేప‌థ్యంలో సినిమా తీశారు. అందులో గాంధీజీ పాత్ర‌ను సెటైరిక‌ల్ గా సంవిధానం చేసిన తీరు ఆక‌ట్టుకుంది. ఇంకా టాలీవుడ్ లో మేజ‌ర్ చంద్ర‌కాంత్ స‌హా ఎన్నో చిత్రాల్లో గాంధీజీ ప్ర‌స్థావ‌న ఆక‌ట్టుకునే తీరుగా ఉంటుంది. గాంధీపై ఎన్ని చిత్రాలొచ్చినా చెప్పుకోద‌గ్గ చిత్రాలుగా ఇవి మాత్ర‌మే చ‌రిత్ర‌లో నిలిచాయి.