Begin typing your search above and press return to search.

ఫిలిం మేకర్స్.. ఇది మీకు అర్థమవుతోందా...!

By:  Tupaki Desk   |   6 Sept 2020 3:20 PM IST
ఫిలిం మేకర్స్.. ఇది మీకు అర్థమవుతోందా...!
X
టాలీవుడ్ లో 2020లో కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువ సినిమాలు నిర్మించబడలేదు. విడుదలైన సినిమాలు చూసుకుంటే కామెడీ, ల‌వ్, ఫ్యామిలీ ఎమోష‌న్ ఎంటర్టైన‌ర్స్ మాత్ర‌మే ఆడియన్స్ ఆదరించారని అర్థం అవుతోంది. సంక్రాంతి వార్ లో తీవ్రంగా పోటీలు ప‌డ్డ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' సినిమాలు మంచి వసూళ్లు రాబట్టాయి. అయినప్పటికీ ఎక్కువమంది ఆడియన్స్ కాస్త ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ టచ్ ఇచ్చిన 'అల వైకుంఠపురంలో' సినిమాకి ఓటేశారు. ఆ తర్వాత వచ్చిన రవితేజ 'డిస్కో రాజా'.. నాగశౌర్య 'అశ్వ‌ధామ'.. విజయ్ దేవరకొండ 'వ‌ర‌ల్డ్ ఫేమస్ ల‌వ‌ర్' సినిమాలు నిరాశపరిచాయి. ఈ సినిమాలన్నీ నిర్మాత‌లకు న‌ష్టాలు మిగిల్చాయి.

ఈ క్రమంలో నితిన్ హీరోగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ 'భీష్మ' బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక డైరెక్ట్ ఓటీటీ రిలీజులు అంటూ హ‌డావుడి మొద‌లైన త‌రువాత వచ్చిన కీర్తి సురేష్ 'పెంగ్విన్.. సత్యదేవ్ '47 రోజుల్లో'.. నాని 'వి' సినిమాలు థ్రిల్ల‌ర్ జోనర్ లో వచ్చాయి. ఇవన్నీ ఓటీటీ ఆడియన్స్ ఆదరణ దక్కించుకోలేకపోయాయి. అయితే 'భానుమతి అండ్ రామకృష్ణ' 'కృష్ణ అండ్ హిజ్ లీల' 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' 'జోహార్' వంటి సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నాయి. దీనిని బట్టి చూస్తే ఈ ఏడాది థ్రిల్లర్ సినిమాలు.. వైలెన్స్ ని ఫైట్స్ ని నమ్ముకుని సినిమాలు నిర్మించిన మేకర్స్ న‌ష్ట‌పోయార‌నే అనుకోవాలి. కేవలం లవ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన‌ర్స్ ని మాత్రమే ఆడియన్స్ నచ్చారని అర్థం అవుతోంది. మరి ఈ విష‌యాన్ని ఫిలిం మేకర్స్ గ‌మ‌నించారో లేదో..!