Begin typing your search above and press return to search.
ఏపీ మంత్రి నానీతో సినీపెద్దల చర్చలు సఫలమేనా?
By: Tupaki Desk | 30 Sept 2021 3:06 PM ISTపవన్ వర్సెస్ వైకాపా ఎపిసోడ్స్ అనంతరం పరిశ్రమలో ఆందోళన మరింత తీవ్రతరమైంది. దీంతో దిద్దుబాటు చర్చలు సాగుతున్నాయి. పరిశ్రమ నిర్మాతలు దిల్ రాజు..సునీల్ నారంగ్...బన్నీవాసు..మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు తదితరులు బుధవారం మంత్రి పేర్ని నానీ తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ టిక్కెటింగ్..ఆక్యుపెన్సీ..టిక్కెట్ ధరలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ చర్చలు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు తాజా సమాచారం. తొలి సమావేశంలో మంత్రి సానుకూలంగా స్పందించారు. నిర్మాతలకు..పంపిణీదారులు..థియేటర్ యాజమాన్యాలకు సానుకూలంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన మాటిచ్చారు. ఆ రకంగానే నిన్నటి భేటి ముగిసినట్లు తెలుస్తోంది.
చివరిగా పరిశ్రమ పెద్దల మధ్య ప్రభుత్వం మధ్య చర్చలు సఫలమైనట్లే కనిపిస్తోంది. వంద శాతం ఆక్యుపెన్సీ..టిక్కెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించడానికి ప్రభుత్వం సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. మల్టీప్లెక్స్..ఏ సెంటర్లలో 150 రూపాయలు.. మున్సిపల్ ఏరియాల్లో 120 రూపాయలు.. పంచాయితీల్లో 100 రూపాయలు గా టిక్కెట్ ధరలు నిర్ణయించినట్లు సమాచారం. ఇక ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్ విషయంలో వెసులుబాట్లు కల్పించారుట. అటు నిర్మాతలకు..ఇటు ప్రేక్షకులకు భారం పడని రీతిలో తక్కువ శాతానికే ట్యాక్స్ ని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఇవన్ని దసరాకల్లా అందుబాటు లోకి రానున్నాయని సమాచారం. ఆ సీజనలో కొన్ని పెద్ద సినిమా రిలీజ్ లు కూడా ఉంటాయి కాబట్టి అప్పటి నుంచి అమలులోకి తీసుకొస్తే బాగుంటుందని ఇరువురు భావిస్తున్నట్లు పరిశ్రమ వర్గాల టాక్.
అలాగే ఆన్ లైన్ టిక్కెటింగ్ విషయంలో ఓ ఎజెన్సీని ఏర్పాటు చేసి తద్వారా విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని నిన్నటి రోజున మంత్రి నాని తెలిపారు. ఇలా చేయడం వల్ల బ్లాక్ మార్కెట్ ని అరికట్టవచ్చని...నిర్ధారించిన ధరలకే టిక్కెట్లు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని...కౌంటర్ల దగ్గర వెయిట్ చేసే పని ఉండదని మంత్రి భావించారు.
నాని వర్సెస్ పవన్ ఎపిసోడ్ ఇలా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -ఏపీ మంత్రి పేర్ని మధ్య మాటల యుద్దం నడుస్తున్న సంగతి తెలిసిందే. `రిపబ్లిక్` ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా తెర లేచిన వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ పై మంత్రి నాని..పోసాని కృష్ణమురిళి ఎదురుదాడికి దిగారు. ఒకరిపై ఒకరు పోటాపోటీగా మీడియా సమావేశాలే ఏర్పాటు చేసి దాడి చేసుకుంటున్నారు. తాజాగా కొద్దిసేపటి క్రితమే మంత్రి నాని చిత్ర పరిశ్రమ పెద్దల సమక్షంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పవన్ పై కౌంటర్ ఏటాక్ కి దిగారు. పవన్ పై తీవ్ర పదజాలంతో దాడి చేసారు.
సంస్కారం లేనిది నాకా నీకా? ముందుగా వివాదం రేపింది నువ్వా? నేనా? నువ్వు సన్నాసి అంటే నేను సన్నాసిన్నర అన్నాను. అందులో తప్పేముంది? నాకు సంస్కారం లేదు. మా అమ్మ ముందే పైకెళ్లిపోయింది కాబట్టి ఆవిడ నాకు నేర్పలేదు. మరి మీ అమ్మగారు అంజనా దేవిగారు ఉన్నారు కదా? అవిడ నీకు సంస్కారం నేర్పాలి కదా? మరెందుకు నేర్పలేదు. అవాకులు చెవాకులు పేలితే ఊరుకోం. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై ఎలా మాట్లాడాలో తెలియదు. నువ్వొక రాజకీయ పార్టీ నడుపుతున్నావు. అది రాజకీయ పార్టీనా..షామినా షాపా అంటూ మంత్రి నాని ఆక్షేపించారు. ఇప్పటివకూ ఇలాంటి రాజకీయ పార్టీని ఎక్కడా చూడలేదని విమర్శించారు.
కోస్తాంధ్రాలో ఓ సంస్కృతి ఉంది. ఒకరు వాయినం ఇస్తే తిరగి వాయినం ఇవ్వడం ఇక్కడ అలవాటు. ఇప్పుడు అదే జరిగింది. ఎవరిది వారికి తిరిగిచ్చేయడం అలవాటు. అది ఓ సంప్రదాయం అని పవన్ ని మంత్రి నానీ ఎద్దేవా చేసారు. ఈ విషయంపై పెద్దలు చిరంజీవి గారు కూడా ఊటీ నుంచి ఫోన్ చేసి విచారం వ్యక్తం చేసారు. అలా జరిగి ఉండాల్సింది కాదన్నారు. ఊటీ నుంచి రాగానే కలుస్తానని అని అన్నారు. అయితే నాని ఈ సమావేశాన్ని చిత్ర పరిశ్రమ పెద్దల సమక్షంలో నిర్వహించడం గమనార్హం. నిర్మాత దిల్ రాజు..మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు..సునీల్ నారంగ్ తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ చేసి వ్యాఖ్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని..తమ సమస్యలు చెప్పుకోవడానికి మంత్రిని కలిసామని చెప్పినట్లు మంత్రివర్యులు తెలిపారు. మొత్తానికి మంత్రి గారు ఇండస్ట్రీ మద్ధతు కూడగట్టి జనసేనానిపై ఎటాక్ కి దిగారు.
ప్రభుత్వ పోర్టల్ టికెటింగ్ పై వివరణ..!
ఏజెన్సీని ఏర్పాటు చేసి ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను అప్పగిస్తామని మంత్రి నాని అన్నారు. ప్రపంచ సినిమా మొత్తం ఆన్ లైన్ టికెటింగ్ నడుస్తుంది. ఏపీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ లాగా సినిమా టిక్కెట్లకు ప్రభుత్వ పోర్టల్ ఏర్పాటు చేస్తాం. దీనిని ఒక ఏజెన్సీ చూసుకుంటుంది. సినీపెద్దలు చాలా మంది నాతో ఫోన్ లో మాట్లాడారు. సాధకబాధకాలు మాట్లాడారు. అన్నిటినీ పరిశీలించాం. మా ప్రభుత్వం తరపున వాస్తవాలకు స్పందిస్తాం. అవాస్తవాలను చెడుగా రుద్దాలని చూస్తే ఇండస్ట్రీ నుంచి తప్పుగా గొంతు విప్పితే రౌద్ర వాతావరణం ఉంటుంది. ఇండస్ట్రీ కలెక్టివ్ గా చెప్పాలి. వాటిని పరిశీలిస్తాం. ప్రభుత్వం సానుకూలంగా ఉంది ఇండస్ట్రీని బతికించడానికి మా వంతు కృషి చేస్తాం.. అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్లపై బతికేయదు కదా..మేం మాట్లాడకుండా వెళ్లిపోతే మీరు అడగాలి. అందరు ఇండస్ట్రీ వాటాదారులతో మాట్లాడి పరిశీలిస్తున్నాం. మీకేం కావాలో చేస్తాం. ఎలా చేయాలో మీరే చేయండి అని మీరే అన్నారు.. అని తెలిపారు. పోర్టల్ కోసం సాఫ్ట్ వేర్ రూపకల్పన పనిని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కి అప్పజెబుతున్నాం. ఫిలిండెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎఫ్ డీసీ) దీనిని పర్యవేక్షిస్తుంది.. అన్నారు. అనంతరం దిల్ రాజు సైతం తామే స్వయంగా ప్రభుత్వ పోర్టల్ రన్ చేయాలని కోరామని అనడం కొసమెరుపు.