Begin typing your search above and press return to search.

మహేష్ ఐదోసారి కొట్టాడు

By:  Tupaki Desk   |   19 Jun 2016 11:13 AM GMT
మహేష్ ఐదోసారి కొట్టాడు
X
టాలీవుడ్లో చిరంజీవి తరం తర్వాత వచ్చిన హీరోల్లో అత్యధికంగా అవార్డులు దక్కించుకున్నది మహేష్ బాబే. హీరో అయిన కొన్నేళ్లకే నందుల పంట పండించిన మహేష్.. ప్రతిష్టాత్మకమైన ఫిలిం ఫేర్ అవార్డుల్లోనూ హవా సాగించాడు. ఇప్పటికే నాలుగుసార్లు ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న మహేష్.. లేటెస్టుగా ‘శ్రీమంతుడు’ సినిమాకు గాను ఐదో అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇంతకుముందు అతను ‘ఒక్కడు’ - ‘పోకిరి’ - ‘దూకుడు’ - ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలకు అవార్డులు అందుకున్నాడు. ఇక నిన్న ప్రకటించిన ఫిలిం ఫేర్ అవార్డుల మిగతా వివరాలు...

లైఫ్ టైమ్ అచీవ్‌ మెంట్ అవార్డు : మోహన్ బాబు
ఉత్తమ చిత్రం: బాహుబలి
ఉత్తమ దర్శకుడు: రాజమౌళి (బాహుబలి)
ఉత్తమ నటి: అనుష్క (రుద్రమదేవి)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (శ్రీమంతుడు)
ఉత్తమ సహాయ నటుడు: అల్లు అర్జున్ (రుద్రమదేవి)
ఉత్తమ సహాయ నటి: రమ్య కృష్ణ (బాహుబలి)
ఉత్తమ గీత రచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (‘కంచె’లో రా ముందడుగేద్దాం..)
ఉత్తమ నేపథ్య గాయకుడు: ఎం.ఎల్.ఆర్. కార్తికేయన్ (‘శ్రీమంతుడు’లో పోరా శ్రీమంతుడా..)
ఉత్తమ నేపథ్య గాయని: గీతా మాధురి (బాహుబలిలో జీవనది...)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: కె.కె. సెంథిల్ కుమార్ (బాహుబలి)
ఉత్తమ కొరియోగ్రఫీ: శేఖర్ (‘బ్రూస్ లీ’లో కుంగ్ ఫూ కుమారి..)
ఉత్తమ నూతన నటుడు: అఖిల్ (అఖిల్)
ఉత్తమ నూతన నటి : ప్రగ్యా జైస్వాల్ (కంచె)
ఉత్తమ నటుడు (జ్యూరీ): నాని (భలే భలే మగాడివోయ్)
ఉత్తమ నటి (జ్యూరీ): నిత్యా మీనన్ (మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు)