Begin typing your search above and press return to search.

సినిమాను నడిపిన వ్యక్తి ఇప్పుడు తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతున్నాడు

By:  Tupaki Desk   |   29 Jun 2020 9:00 AM IST
సినిమాను నడిపిన వ్యక్తి ఇప్పుడు తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతున్నాడు
X
మహమ్మారి వైరస్‌ ఎంతో మంది జీవితాలను తలకిందులు చేసింది. ఈ ఏడాది జనవరి ఫిబ్రవరిలో కూడా చాలా సంతోషంగా జీవితాలు గడిపిన వారు ఇప్పుడు కనీసం తినడానికి తిండి లేక విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అత్యంత దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండి లేక గతం లో గొప్ప పనులు చేసిన వారు ఇప్పుడు చిల్లర పనులు చేసేందుకు కూడా వెనకాడటం లేదు. తాజాగా ఏపీ తాడిపత్రి కి చెందిన ఖాదీర్‌ భాష పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల కు అద్దం పడుతోంది.

తాడిపత్రి లో థియేటర్‌ మేనేజర్‌ గానే కాకుండా కొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ కూడా చేసిన ఖాదీర్‌ బాబు గత నాలుగు నెలలు గా థియేటర్లు ఓపెన్‌ లేక పోవడంతో జాబ్‌ పోగొట్టుకున్నాడు. మొదటి రెండు నెలలు ఏదోలా కుటుంబం గడిచినా కూడా ఆ తర్వాత కష్టం అయ్యింది. భార్య ముగ్గురు పిల్లల పోషణ కష్టం అయ్యింది. మొదట భార్య పూల బండి వ్యాపారం చేసింది. ప్రస్తుతం భాష కూరగాల వ్యాపారం చేస్తున్నాడు.

కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉన్న కారణంగా భాష తోపుడు బండి అద్దెకు తీసుకుని దానిపై కూరగాయలు పోసుకుని వీధుల్లో తిరుగుతూ అమ్ముతున్నాడు. గతంలో కొత్త సినిమాల టికెట్ల కోసం పదుల సంఖ్యలో ఆయనకు ఫోన్‌ చేసే వారు. ఆయనకు థియేటర్‌ మేనేజర్‌ అంటూ ప్రత్యేకమైన గుర్తింపు స్థానికం గా ఉంది. కాని ఇప్పుడు మాత్రం పరిస్థితి దారుణం గా ఉంది. ఎవరు గుర్తు పట్టకుండా మాస్క్‌ కట్టుకుని కూరగాయలు అమ్ముతున్నాడు.