Begin typing your search above and press return to search.

#రాధే ఫ‌న్ .. క‌ర్ఫ్యూ ఉంద‌ని మ‌ర్చిపోయి ఎటో పోయాడ‌ట‌!

By:  Tupaki Desk   |   17 May 2021 3:37 AM GMT
#రాధే ఫ‌న్ .. క‌ర్ఫ్యూ ఉంద‌ని మ‌ర్చిపోయి ఎటో పోయాడ‌ట‌!
X
బాలీవుడ్ కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన రాధే ఈద్ కానుక‌గా ఈనెల 13న రిలీజైన సంగ‌తి తెలిసిందే. 40 దేశాల్లో థియేట్రిక‌ల్ గా రిలీజైన ఈ చిత్రాన్ని జీ-5 స‌హా ప‌లు వేదిక‌ల‌పై పే-ప‌ర్ వ్యూ విధానంలోనూ ఆడిస్తున్నారు. అయితే ఈ సినిమాపై క్రిటిక్స్ తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. అలాగే ఆడియెన్ అయితే ఫ‌న్నీ ఈమోజీల్ని షేర్ చేస్తూ .. బోలెడంత కామెడీ చేస్తున్నారు. ఇలాంటి సినిమా మునుపెన్న‌డూ చూడ‌లేద‌ని వాపోయిన వాళ్లు ఉన్నారు.

తాజాగా ఓ అభిమాని స‌ల్మాన్ భాయ్ గాల్లో హెలీకాఫ్ట‌ర్ పైకి జంప్ చేసే సీన్ ని ఫేస్ బుక్ లో షేర్ చేసి ఫ‌న్నీ వ్యాఖ్య‌తో గాలి తీసేశాడు. ``అనవసరంగా మన తెలుగు మాస్ హీరోలను ట్రోల్ చేస్తాం కానీ.. ఇవాళ రాధేలో ఈ సీన్ చూశాక కర్ఫ్యూ ఉందని మర్చిపోయి జేబులో రెండు చేతులు పెట్టుకుని అలా ఎక్కడికో నడుచుకుంటూ వెళ్లిపోయా...`` అంటూ పంచ్ వేశాడు.

నిజానికి గాల్లో ఎగిరి వెళుతున్న హెలీకాఫ్ట‌ర్ లోకి భాయ్ జంప్ చేసిన విధానం అంత కామెడీగానే ఉంది. ఇది తెలుగు మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి స్ఫూర్తితో ప్ర‌భుదేవా ఐడియానా? అంటూ పంచ్ లు వేస్తున్న వాళ్లు లేక‌పోలేదు. అయితే క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో మాస్ డైరెక్ట‌ర్ల వ‌ల్ల‌ ఇలాంటి ఎగ్జాగరేష‌న్ నిరంత‌రం చూసేదే. ఇక రాధే చిత్రానికి ఐఎండీబీలో 2.5 రేటింగ్ ఇవ్వ‌డంపై బాలీవుడ్ క్రిటిక్ క‌మ‌ల్ ఆర్.ఖాన్ బోలెడంత కామెడీ నే చేస్తున్నాడు. దుబాయ్ లో ఓ థియేట‌ర్ లో రాధే చిత్రాన్ని వీక్షించిన క‌మ‌ల్ ఆర్.ఖాన్ సెకండాఫ్ చూడ‌ట‌మెలా దేవుడా! అంటూ ఏడుపు ముఖంతో క‌నిపించాడు. ప్ర‌స్తుతం ఆ ఫోటో వైర‌ల్ గా మారింది.