Begin typing your search above and press return to search.

ఏపీ సీఎంకి ఛాంబ‌ర్ లేఖ‌..మ‌ళ్లీ మొద‌టికేనా?

By:  Tupaki Desk   |   19 Jun 2022 7:30 AM GMT
ఏపీ సీఎంకి ఛాంబ‌ర్ లేఖ‌..మ‌ళ్లీ మొద‌టికేనా?
X
ఏపీలో సినిమా టిక్కెట్ల అంశంపై ప్ర‌భుత్వం తీసుకొచ్చిన జీవో నెం 69 ర‌సాభాస‌గా మారిన సంగ‌తి తెలిసిందే. జీవోకి క‌ట్టుబ‌డి థియేట‌ర్ యాజ‌మాన్యాలు ప్ర‌భుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోవాల‌ని అదేశాలు జారీ చేయ‌డంతో స‌న్నివేశం ఒక్క‌సారిగా వేడెక్కింది. ఎంఓయూ తో ఒప్పందానికి యాజ‌మాన్యాలు స‌సేమీరా అన‌డంతో క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చిన‌ట్లే క‌నిపిస్తుంది.

తాజాగా ఈ విష‌యంపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫిలిం ఛాంబ‌ర్ ఓ లేఖ రాసింది. అన్లైన్ టిక్కెట్ అమ్మ‌కాలు.. దాని ద్వారా వ‌చ్చే ఆదాయం ఛాంబ‌ర్ ఆధ్వ‌ర్యంలోనే జ‌ర‌గాల‌ని లేఖ‌లో పేర్కొంది. ఏపీ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ద్వారా.. లింక్ ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫిలిం డెవ‌లెప్ మెంట్ కార్పోరేష‌న్ కి ఇస్తామ‌ని లేఖ‌లో ప్ర‌స్తావించింది. ప్ర‌భుత్వం ఇచ్చిన జీవో కంటే ప్ర‌స్తుతం ఉన్న విధాన‌మే బాగుంద‌ని..ఈ విధానం ద్వారా టిక్కెట్ విక్ర‌యాలు జ‌రిగితే బాగుంటుందని అభిప్రాయ‌ప‌డింది.

ఎంఓయూలో పొందుప‌రిచిన విష‌యాలపై స్ప‌ష్ట‌తో లోపించింద‌ని.. అలాగే కాల ప‌రిమితి కూడా త‌క్కువ‌గా ఉంద‌ని గుర్తు చేసింది. పైగా ఎంఓయూ పై సంత‌కాలు పెట్ట‌మ‌ని అధికారులు తీవ్ర‌మైన ఒత్తిడి తీసుకొస్తున్నార‌ని.. జీవో వ‌ల్ల సినీ ప‌రిశ్ర‌మ దెబ్బ తింటుంద‌ని లేఖ‌లో వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు. గ‌వ‌ర్న‌మెంట్ జీవో ప్ర‌కారం విక్ర‌యాలు జ‌రిగితే దాని ద్వారా వ‌చ్చే ఆదాయం ఎప్పుడు ఇస్తుందో చెప్ప‌లేద‌ని..దీనిపై వివ‌ర‌ణ కూడా అవ‌స‌ర‌మ‌ని లేఖ‌లో విజ్ఞ‌ప్తి చేసారు.

మ‌రి దీనిపై ప్ర‌భుత్వ పెద్ద‌లు..అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. దీనిపై అధికారుల‌తో ఛాంబ‌ర్ ప్ర‌తినిధులు స‌మావేశ‌మ‌వుతారా? ప‌రిశ్ర‌మ పెద్ద‌లు రంగంలోకి దిగుతారా? అన్న‌ది చూడాలి. ఈ విష‌యంపై ఇంకా ఇండ‌స్ర్టీ పెద్ద‌లు స్పందించ‌లేదు. ఇప్ప‌టికే థియేట‌ర్ కి ప్రేక్ష‌కులు రావ‌డం త‌గ్గింది. టిక్కెట్ ధ‌ర‌లు అధికంగా పెంచ‌డంతోనే ఆక్యెపెన్సీ త‌గ్గింది. ఈ స‌మ‌స్య‌ని ఎలా ప‌రిష్క‌రించాలా? అని పెద్ద‌లు ఇప్ప‌టికే త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇటీవ‌లే కొన్ని సినిమాలు పాత ధ‌ర‌ల‌తో రిలీజ్ చేసినా ప్రేక్ష‌కులు అనాస‌క్తి చూపించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఇచ్చిన కొత్త జీవో ప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌కి మ‌రో సంకటంగా మారింది.