Begin typing your search above and press return to search.

డ్రగ్ దందాలో దొరికిపోయిన సినీనటుడు

By:  Tupaki Desk   |   31 Jan 2017 4:49 AM GMT
డ్రగ్ దందాలో దొరికిపోయిన సినీనటుడు
X
సినీ నటుడు అభిషేక్ అంటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు.కానీ.. డేంజర్.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా తదితర సినిమాల్లో యాక్ట్ చేసిన అభిషేక్ అన్నా.. ఇతగాడి ఫోటోను చూపించినా ఇట్టే గుర్తు పట్టేసే వీలుంది. సినీనటుడిగా పరిచయం ఉన్న ఇతడిపై గతంలోనూ నేరారోపణలు ఉన్నాయి. తాజాగా ఇతడ్ని డ్రగ్స్ దందాలో పోలీసులు బుక్ చేయటం సంచలనంగా మారింది.

సంపన్నుల్ని లక్ష్యంగా చేసుకొని విదేశీయులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడిన అభిషేక్.. డ్రగ్స్ దందాను నడుపుతున్నట్లుగా గుర్తించారు. గుట్టుగా డ్రగ్స్ ను అమ్మే ఇతగాడి దగ్గర ఏకంగా ఐదు వేల మంది కస్టమర్ల లిస్టు ఉందని తెలుస్తోంది. ఈ గుట్టును రట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అభిషేక్ తో సహా అతడి వ్యాపారంతో సంబంధాలున్న పలువురిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు.

సౌతాఫ్రికాకు చెందిన మండేలా జేమ్స్.. ఘనాకు చెందిన డ్రేక్ ఓవెన్ లుఇద్దరు వ్యాపారం కోసం ఇండియాకు వచ్చారు. క్లాత్ బిజినెస్ మీద ఇండియాకు వచ్చిన వారు డ్రగ్స్ దందాకు తెర తీశారు. సౌతాఫ్రికా నుంచి ముంబయికి డ్రగ్స్ తీసుకొచ్చే వీరు.. అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించటం మొదలు పెట్టారు. హైదరాబాద్ లో సినీనటుడు అభిషేక్ తదితరులతో కలిసి వ్యాపారాన్ని షురూ చేసిన వారు గ్రాము కొకైన్ రూ.3500లకుఅమ్ముతున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అభిషేక్ ను విచారిస్తున్నారు. ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయన్న విషయంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరెంత మంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/