Begin typing your search above and press return to search.

#2021NYE బీచ్ లో అగ్గి రాజేసిన `ఫైట‌ర్` గాళ్

By:  Tupaki Desk   |   1 Jan 2021 7:18 AM GMT
#2021NYE బీచ్ లో అగ్గి రాజేసిన `ఫైట‌ర్` గాళ్
X
2020 లాస్ట్ డే సాయం సంధ్య సూర్యుడిని నేను చూశాను..!! అంటూ తెగ సంబ‌ర‌ప‌డిపోతూ ఇదిగో ఈ ఫోటోని షేర్ చేసింది అన‌న్య‌. అదంతా స‌రే కానీ ఆ ఫ్లోర‌ల్ మినీ స్క‌ర్ట్ ఖ‌రీదెంతో తెలుసా? అక్ష‌రాలా పన్నెండు వేలు.. అంతే..

ఉన్న‌ట్టుండి చ‌లికాలాన్ని మ‌రిపిస్తూ అగ్గి రాజేస్తోంది వ‌ర‌స ఫోటో ట్రీట్ తో. గత వారం ఫోటోషూట్ నుంచి త్రోబ్యాక్ ఫోటో ఇది. అనన్య పాండే జూలై లో ఓసారి మైక్రో మినీ స్కర్ట్ .. జాకెట్ ‌తో అద‌ర‌గొట్టింది. . ఒకవేళ అప్పుడు మిస్స‌యినా తాజా మినీ స్క‌ర్ట్ వెల్ ట్రీట్ అవుతుంది. బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్ నుంచి మ‌చ్చు తున‌క ఇది.

అనన్య తన దుస్తుల ఎంపిక టూమ‌చ్ హాట్ అనే చెప్పాలి. ఓవ‌రాల్ గా నేచురల్ లుక్ ఎంచుకున్నా..ఆ చిలిపి న‌వ్వుతోనే గుండెల్ని లాగేస్తుంది. ఇంత‌కీ ఈ మినీ స్క‌ర్ట్ ఖ‌రీదు ఎంత‌? అంటే..అనన్య ధరించిన లగూన్ కో-ఆర్డర్ దుస్తులకు రూ .11999 రేంజులో ఉందిట‌.

చుంకీ పాండే- భావనా పాండే జంట‌ కుమార్తె అనన్య పాండే 2019 లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 తో బాలీవుడ్ ‌లోకి అడుగుపెట్టింది. అటుపై ప‌తి ప‌త్ని ఔర్ వో - ఖాలి పీలీ చిత్రాలలో నటించింది. ప్ర‌స్తుతం వ‌రుస‌గా క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ - పూరి కాంబినేష‌న్ మూవీ ఫైట‌ర్ తో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది.