Begin typing your search above and press return to search.

రామ్ చ‌ర‌ణ్ 15 లో క‌త్తి ఫైట్ హైలైట్ !

By:  Tupaki Desk   |   10 Dec 2021 10:30 AM GMT
రామ్ చ‌ర‌ణ్ 15 లో  క‌త్తి ఫైట్ హైలైట్ !
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా RC15 చిత్రం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొద్ది భాగం షూటింగ్ కూడా జ‌రిగింది. అయితే కోర్టు తీర్పు నేప‌థ్యంలో మ‌ధ్య‌లో నిలిచిపోయిన `ఇండియ‌న్ -2` షూటింగ్ ముందుగా పూర్తిచేయాల్సిన స‌ద‌ర్భంగా శంక‌ర్ ఈ నెల నుంచి ఆ సినిమా ప‌నుల్లో బిజీ అయ్యారు.

ఇక చ‌ర‌ణ్ `ఆర్ ఆర్ ఆర్` ప్ర‌చారంలోనూ బిజీ అయ్యారు. జ‌న‌వ‌రిలో చ‌ర‌ణ్ న‌టించిన `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ త‌ర్వాత మెగా ప‌వ‌ర్ స్టార్ కొత్త ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించ‌నున్నార‌ని తెలుస్తోంది. `జెర్సీ` ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ 16వ చిత్రాన్ని లాంచ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

శంక‌ర్ `ఇండియ‌న్ -2` పూర్తిచేసి బ‌య‌ట‌కు రావ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. కాబ‌ట్టి ఈలోపు 16వ చిత్రాన్ఇన సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని చ‌ర‌ణ్ ముందుకు కదులుతున్నాడు. ఇప్ప‌టికే స్ర్కీప్ట్ కూడా లాక్ అయింది. గౌత‌మ్ తిన్న‌నూరి `మ‌ళ్లీరావే` అనే తొలి సినిమాతో మంచి క్రియేటివ్ మేక‌ర్ గా ప్రూవ్ చేసుకున్నాడు.

అటుపై `జెర్సీ` లాంటి స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ సినిమా తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా గౌత‌మ్ రీమేక్ చేస్తున్నాడు. ఆ ర‌కంగా చ‌ర‌ణ్ కి గౌత‌మ్ అంటే అన్ని వైపులా పాజిటివి గా కనిపిస్తున్నాడు.

ఈ నేప‌థ్యంలో ఎక్కువ‌ సినిమాలు చేసిన అనుభ‌వం లేక‌పోయినా క్రియేటివ్ మేక‌ర్ అన్న కాన్ఫిడెన్స్ తో అవ‌కాశం క‌ల్పించారు. చ‌ర‌ణ్ తో చేయ‌బోయే స్ర్కిప్ట్ కూడా యూనిక్ గా ఉంటుంద‌ని తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమాలో ఓ క‌త్తి ఫైట్ హైలైట్ గా ఉంటుంద‌ని లీకులందాయి. హాలీవుడ్ రేంజ్ లో ఈ క‌త్తి పైట్ ని డిజైన్ చేసిన‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే గౌత‌మ్ గ‌త రెండు చిత్రాలు ఎమోష‌న్ తో కూడుకున్న‌వే. ఎక్క‌డా యాక్ష‌న్ స‌న్నివేశాలు ఉండ‌వు. ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ తో క‌త్తి ఫైట్ లో క్రియేటివిటీ ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి.