Begin typing your search above and press return to search.

ఉదయభానుకి 'హీరోయిన్' పంచ్

By:  Tupaki Desk   |   17 July 2017 5:36 AM GMT
ఉదయభానుకి హీరోయిన్ పంచ్
X
సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించన గౌతమ్ నంద చిత్రం ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది గౌతమ్ నంద చిత్రీకరణ సమయంలో తమ అనుభవాలను పంచుకున్నారు. అలాగే.. ఫైట్ మాస్టర్లు రామ్ లక్షణ్ లను కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ కాసింత ఎక్కువగానే చెప్పింది హోస్ట్ ఉదయభాను.

అయితే.. స్టేజ్ పైకి రాగానే ఉదయభాను ఇచ్చిన బిల్డప్ అంతా తుస్సుమనిపించేశారు రామ్ లక్ష్మణ్ లు. 'మా గురించి ఉదయభాను గారు చాలా చెప్పింది. కానీ అదంతా నిజం కాదు. ఏదో మా మీద అభిమానం కొద్దీ అలా చెప్పిందంతే' అంటూ అంతటి పొగడ్తలకు తాము అర్హులం కామని.. అవన్నీ అవసరం లేదని చెప్పారు. అంతలోనే తన మాటలను కంటిన్యూ చేస్తూ.. 'ఒకటి అడగాలి.. నువ్వు వస్తేనే బ్రైట్.. ఇక ఇలాంటి బ్రైట్ చీర కట్టుకు వస్తే కుర్రోళ్ల పరిస్థితేంటి ఇక' అనేశాడు ఈ ఫైట్ మాస్టర్. దీంతో కాసింత సిగ్గు పడిపోయిన ఈ సీనియర్ యాంకర్.. రెండు మూడేళ్లుగా గ్యాప్ తాను కనిపించలేదని.. చాలామంది కనిపించాల్సిందిగా అడుగుతున్నారంటూ చెప్పుకొచ్చింది.

అయినా సరే ఈ టాపిక్ వదిలిపెట్టని ఈ యాక్షన్ కొరియోగ్రాఫర్.. 'మా ఫేవరేట్ హీరోయిన్ ఉదయభాను.. మేం హీరోలుగా నటించిన ఖైదీ బ్రదర్స్ లో హీరోయిన్ గా నటించింది. ఆ అభిమానంతో మమ్మల్ని కాసింత ఎక్కువగా పొగిడిందంతే' అని చెప్పేసి అప్పటి కాలంలో తమ హీరోయిన్ కాబట్టే.. ఇప్పుడు తమకు ఓవర్ గా బిల్డప్ ఇస్తోందని చెప్పేశారు రామ్ లక్షణ్.