Begin typing your search above and press return to search.

భిక్షాటన చేస్తామంటున్న ఫైట్ మాస్టర్స్

By:  Tupaki Desk   |   13 Jun 2016 9:30 AM GMT
భిక్షాటన చేస్తామంటున్న ఫైట్ మాస్టర్స్
X
రామ్ లక్ష్మణ్ లు ఫైట్ మాస్టర్స్ గా టాలీవుడ్ జనాలకు - ప్రేక్షకులకు పరిచయస్తులే. ఇప్పటికి వెయ్యికి పైగా సినిమాలకు వీరు స్టంట్స్ సమకూర్చారు. ఫైట్ మాస్టర్స్ గానే కాకుండా.. వీరిలో మరో యాంగిల్ కూడా ఉందనే విషయం కొంతమందికే తెలుసు. సామాజిక సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడం.. నలుగురికీ మంచి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండడం రామ్ - లక్ష్మణ్ ల స్పెషాలిటీ.

ప్రస్తుతం అనంతపురం జిల్లాలో సేవా కార్యక్రమాల కోసం నిధులు సమీకరిస్తున్నారు ఈ జంట స్టంట్ మాస్టర్లు. నిరుపేదలకు సాయం చేసేందుకు ఏదైనా చేయాలనే ఆలోచన ముందునుంచీ ఉందని, ఇప్పుడు అందులోనే మానసిక తృప్తిని వెతుక్కుంటున్నట్లు చెబుతున్నారు. అయితే మంచి చేయడం కోసం మహేష్ బాబు లాగా ఊరిని దత్తత తీసుకోవడం తమ వల్ల కాదని తేల్చేసిన రామ్ లక్ష్మణ్ లు.. మహేష్ వెనక సూపర్ స్టార్ కృష్ణ ఉన్నారని, తమ వెనక ఎవరూ లేరు కదా అంటున్నారు.

తాము అందుకునే రెమ్యూనరేషన్ లో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం ఉపయోగిస్తున్నా అది చాలడం లేదన్న రామ్ లక్ష్మణ్ లు.. పేదలకు సాయం చేసేందుకు త్వరలో జోలి కట్టి భిక్షాటన చేస్తామని చెబుతున్నారు. వచ్చే నెలలో అనంతపురం ఈ కార్యక్రమం చేపట్టి.. వీలైనన్ని నిధులు సేకరిస్తామని, వచ్చే సొమ్ములతో పది మందికీ ఉపయోగపడే మంచి పనులు చేస్తామని అంటున్నారు.