Begin typing your search above and press return to search.

నైజాంలో పుష్పకు ఐదో షో అనుమ‌తి

By:  Tupaki Desk   |   16 Dec 2021 5:00 PM IST
నైజాంలో పుష్పకు ఐదో షో అనుమ‌తి
X
అల్లు అర్జున్ న‌టించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప ఈనెల 17న గ్రాండ్ గా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. రిలీజ్ ముందు పుష్ప‌కు అన్నీ సానుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయి. ఇంత‌కుముందు ఏపీలో పాత టిక్కెట్ ధ‌ర‌ల‌కు స‌మ్మ‌తించాల‌ని కోర్టు తీర్పు వెలువ‌రించింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న థియేటర్లకు మరో రెండు వారాల పాటు ఒక రోజులో అదనపు షోలు వేసుకునేందుకు అనుమతినిచ్చింది.

దీంతో తెలంగాణలో పుష్ప కు తొలి వీకెండ్ అదిరిపోయే బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ సాధ్య‌మ‌ని భావిస్తున్నారు. ఇప్పటికే చాలా థియేటర్లు మల్టీప్లెక్స్ లు టికెట్ ధరలను పెంచాయి. అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ చాలా ప్రోత్సాహకరంగా ఉంది. హైదరాబాద్ లో కొన్ని చోట్ల బెనిఫిట్ షోలు ప్లాన్ చేస్తున్నారు. అదంతా `పుష్ప`కు అనుకూలంగా జరుగుతోంది.

ఏపీలో ప‌రిస్థితులు మాత్రం దీనికి విరుద్ధంగా ఉన్నాయి. టికెట్ ధరల వివాదం ఏపీ హైకోర్టుకు చేరడంతో కోర్టు నిర్ణయాన్ని జాయింట్ కలెక్టర్లకు వదిలేసింది. జిల్లా నిర్వాహకులు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తారు అంటే థియేటర్లలో టిక్కెట్ ధరలను పెంచడానికి అనుమతి లేదు.

అలాగే థియేటర్లపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే థియేటర్లను నిలిపివేయాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. పుష్ప తెలుగు-త‌మిళం-హిందీ- మ‌ల‌యాళం -క‌న్న‌డ‌లో విడుద‌ల‌వుతోంది. అమెరికాలోనూ అత్యంత భారీగా విడుద‌ల చేస్తున్నారు. ఇంటా బ‌య‌టా ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.