Begin typing your search above and press return to search.

ఎంత పని చేశావ్ వరుణ్..

By:  Tupaki Desk   |   10 Nov 2016 10:53 AM GMT
ఎంత పని చేశావ్ వరుణ్..
X
సినిమా అంటే కొన్ని వందల మందితో ముడిపడ్డ వ్యవహారం. ఈ వందల మందిలో ఒక వ్యక్తి తేడా చేసినా.. షెడ్యూళ్లు డిస్టర్బ్ అయిపోతాయి. ముఖ్యంగా రీప్లేస్మెంట్ లేని వ్యక్తులకు ఏమైనా అయితే అంతే సంగతులు. లక్షలు.. కోట్లల్లో నష్టం వస్తుంది. చాలామంది డేట్లను సమీకరించి షూటింగ్ చేస్తుంటారు కాబట్టి.. కాస్ట్ అండ్ క్రూలో కీలకమైన వ్యక్తికి ఏం జరిగినా.. మొత్తం తేడా కొట్టేస్తుంది. ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమాల విషయంలో ఇలాగే జరుగుతోంది.

ఆ మధ్య ‘మిస్టర్’ సినిమా షూటింగ్ సందర్భంగా వరుణ్ తేజ్ మోకాలికి పెద్ద గాయమవడం.. అతను కాలికి కట్టు కట్టించుకుని ఇంటిముఖం పట్టడం తెలిసిన సంగతే. ముందు చిన్న గాయమే అనుకున్నారు కానీ.. రెండు నెలల పాటు ఇంటి నుంచి కదల్లేని పరిస్థితి ఎదురైంది అతడికి. ఈ దెబ్బతో అతను చేస్తున్న.. చేయాల్సిన సినిమాలపై ప్రభావం పడింది. మిస్టర్ షూటింగ్ రెండు నెలలుగా ఆగిపోయింది. ప్రధానంగా వరుణ్ తో ముడిపడ్డ సన్నివేశాలే తీయాల్సి ఉండటంతో ఏం చేయడానికి లేకపోయింది. చాలామంది డేట్లు వృథా అయ్యాయి. దీంతో ఈ సినిమా అనుకున్న దాని కంటే చాలా ఆలస్యంగా రిలీజవనుంది.

మరోవైపు ‘మిస్టర్’తో సమాంతరంగా వరుణ్ చేస్తున్న ‘ఫిదా’ షెడ్యూళ్లు కూడా డిస్టర్బ్ అయ్యాయి. బాన్సువాడలో దాదాపు సగం సినిమాను పూర్తి చేసిన శేఖర్ కమ్ముల.. మిగతా సగ భాగం సినిమా చిత్రీకరణకు యుఎస్ వెళ్లడానికి ప్లాన్ చేశాడు. ఇందుకోసం నవంబరు.. డిసెంబరు నెలలకు వీసాలు తీసుకున్నారు. కానీ వరుణ్ గాయం దెబ్బకు ఈ నెలల్లో యుఎస్ వెళ్లలేని పరిస్థితి నెలకొందింది. ఇప్పుడు కొత్తగా జనవరి-మార్చి నెలల మధ్య షూటింగ్ కోసం వీసాలు తీసుకోవాల్సి వస్తోంది. ముందు అనుకున్నట్లుగా వేలంటైన్స్ డేకి ఈ సినిమా రిలీజ్ చేయడం కూడా కుదరట్లేదు. మరోవైపు వరుణ్‌ తో తన తర్వాతి సినిమా తీద్దామనుకున్న యువ దర్శకుడు చందూ మొండేటి కూడా తన ప్లాన్స్ మార్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/