Begin typing your search above and press return to search.

ఫిదాపై ఇంట్రెస్ట్ పెరిగిపోతోందిగా

By:  Tupaki Desk   |   2 July 2017 5:28 AM GMT
ఫిదాపై ఇంట్రెస్ట్ పెరిగిపోతోందిగా
X
మెగా ఫ్యామిలీలో క్లాస్ హీరో అయిన వరుణ్ తేజ్.. ప్రారంభం నుంచి డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. కానీ ఈ హీరో చేసిన గత రెండు చిత్రాలైన లోఫర్.. మిస్టర్ లు నిరాశపరిచాయి. మిస్టర్ మూవీపై ఎన్నో హోప్స్ పెట్టుకున్న వరుణ్ తేజ్.. ఆ చిత్రం ఫెయిల్ కావడంతో బాగా డిజప్పాయింట్ అయిపోయాడు. ఇప్పుడీ వరుణ్ తేజ్ నటించిన నెక్ట్స్ మూవీ రిలీజ్ కి రెడీ అయిపోతోంది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన ఫిదా చిత్రంపైనే వరుణ్ తేజ్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. నిజానికి ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యే వరకూ.. అసలు మూవీపై బజ్ లేదు. కానీ ట్రైలర్ విభిన్నంగా ఉండడం.. శేఖర్ కమ్ముల మార్క్ క్లాస్ టచ్ ఉండడంతో.. ఇప్పటికే 5 మిలియన్ల వ్యూస్ మార్క్ దాటి ఈ మూవీ దూసుకుపోతోంది. ఆల్బం నుంచి 'వచ్చిండే.. మెల్ల మెల్లగ వచ్చిండే' అంటూ సింగర్ మధుప్రియ.. తెలంగాణ స్టైల్ లిరిక్ ను ఫుల్ ఎనర్జీతో పాడిన పాటను విడుదల చేయగా.. ఇన్ స్టంట్ గా ఈ పాట జనాలకు ఎక్కేసింది.

పాటలోని విజువల్స్ కూడా కొత్తగా కనిపిస్తున్నాయి. మధుప్రియ పాడిన ఈ పాట ఫిదా మూవీపై ఇండస్ట్రీలో బజ్ పెరిగేందుకు.. జనాల్లో ఆసక్తి పెరిగేందుకు బాగానే హెల్ప్ అయింది. తెలంగాణ అమ్మాయిగా ప్రేమమ్ బ్యూటీ సాయిపల్లవి సూపర్బ్ గా ఉందంటున్నారు జనాలు. జూలై చివరి వారంలో ఫిదాను రిలీజ్ చేసేందుకు నిర్ణయించాడు నిర్మాత దిల్ రాజు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/