Begin typing your search above and press return to search.

మోషన్ పోస్టర్: ఫిదా చేస్తున్నారంతే!!

By:  Tupaki Desk   |   9 May 2017 9:11 AM GMT
మోషన్ పోస్టర్: ఫిదా చేస్తున్నారంతే!!
X
ఇప్పుడు వస్తున్న ప్రేమ కావ్యాల్లో జోకులు ఎక్కువ.. ప్రేమ తక్కువ అనే ఫీలింగ్ ఉండనే ఉంది. అయితే ఇటువంటి ప్రేమలు రియలిస్టిక్ గా చూపించడంలో దిట్ట అయిన శేఖర్ కమ్ముల కూడా ఈమధ్యన గాడీ తప్పేశాడు. కాని ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ''ఫిదా'' అంటూ వస్తున్నాడు. ఈ సినిమాతో మాయ చేయడం గ్యారంటీ అంటున్నాడు.

దిల్ రాజు ప్రొడక్షన్లో.. వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న ఈ సినిమాతో.. తమిళ సుందరి సాయి పల్లవి తెలుగులో డెబ్యూ చేస్తోంది. ఈ సినిమాతో అమ్మడు ఇక్కడ కూడా మలయాళం తరహాలో భారీ మార్కెట్ పెంచుకుంటుంది అంటున్నారు. ఇకపోతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ ప్రేమమ్ బ్యూటీ కోసం ఫిదా టీమ్ ఒక మోషన్ పోస్టర్ తో విషెస్ చెప్పారు. వోణి వేసుకుని.. సాయిపల్లవి గాల్లోకి ఎగురుతుంటే.. అక్కడ ఫ్రీజ్ చేసి చక్కగా మాంచి మ్యూజిక్ తో ఫిదా అంటూ ఆడియన్స్ ను ఫిదా చేశారు. నిజంగానే ఈ పోస్టర్ చాలా బాగుందని చెప్పాలి.

మరి మోషన్ పోస్టర్లలో చూపించిన ఈ కిక్ సినిమలో కూడా ఎంతవరకు ఉంటుంది అనేది చూడాల్సిన అంశం.