Begin typing your search above and press return to search.

మోషన్ పోస్టర్: వరుణ్ ఫిదా చేసేస్తున్నాడు

By:  Tupaki Desk   |   19 Jan 2017 6:49 AM GMT
మోషన్ పోస్టర్: వరుణ్ ఫిదా చేసేస్తున్నాడు
X
ఇవాళ మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ పుట్టిన రోజు. ప్రస్తుతం ఈ కుర్రాడు రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ చేసేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనువైట్లతో మిస్టర్ మూవీ.. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో ఫిదా చిత్రాల్లో నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ఇప్పటికే మిస్టర్ యూనిట్ రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ సూపర్బ్ కిక్ ఇచ్చింది.

ఇప్పుడు శేఖర్ కమ్ముల ఫిదా మూవీకి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు. స్మూత్ గా ఉన్న మ్యూజిక్.. వరుణ్ తేజ్ డిఫరెంట్ గెటప్స్.. ఓ అమ్మాయి వైపు కుర్రాడు నడుస్తున్నట్లుగా ఉన్న బ్యాక్ డ్రాప్ భలేగా ఆకట్టుకున్నాయి. మోషన్ పోస్టర్ ని సరిగ్గా గమనిస్తే.. అమెరికాలో ఉన్న కుర్రాడు.. పల్లెటూరిలో ఉన్న అమ్మాయి వైపు నడుస్తున్నట్లుగా కనిపిస్తుంది. లవ్-హేట్-లవ్ స్టోరీ అంటూ తగిలించిన ట్యాగ్ లైన్ ఇంకా ఆకట్టుకుంటుంది.

ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు అమెరికాలో కూడా ఫిదా మూవీకి సంబంధించిన కొంత ఎపిసోడ్ ని చిత్రీకరించాల్సి ఉంటుంది. కుర్రాడు అమెరికా నుంచి ఇండియాకి వస్తాడంటూ.. మోషన్ పోస్టర్ లో ఫిదా యూనిట్ చెప్పిన తీరు చూస్తే.. ఎవరైనా సరే శేఖర్ కమ్ముల తెలివితేటలకి ఫిదా అయిపోవాల్సిందే. దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో మలయాళీ కుట్టి సాయి పల్లవి హీరోయిన్.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/