Begin typing your search above and press return to search.

చక్కనైన లంక అందంలో చిక్కాల్సిందే

By:  Tupaki Desk   |   3 April 2017 1:28 PM GMT
చక్కనైన లంక అందంలో చిక్కాల్సిందే
X
శ్రీలంక అందం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో ఇప్పుడు ఇండియన్ కుర్రాళ్లకు పరిచయం అక్కర్లేదు. ఐదేళ్ల పాటు తెగ కష్టపడిపోయిన తర్వాత.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒకే ఒక్క ఆఫర్ ఇచ్చి.. అమ్మడి కెరీర్ కి కిక్ ఇచ్చేశాడు. ఆ తర్వాత కాసింత కూడా ఖాళీ లేకుండా దూసుకుపోతున్న ఈ సుందరి.. అందాలు పంచడంలో అస్సలు మొహమాటాలు పెట్టుకోదు.

ఎఫ్ హెచ్ ఎం మేగజైన్ తాజా ఎడిషన్ కు కవర్ పేజ్ ఎక్కేసింది జాక్వెలిన్. అందాల మోత మోగించేసి అందుకున్న అవకాశం కాదిది. ప్రపంచంలో సెక్సియెస్ట్ ఉమన్ ఎవరంటూ ఆ మేగజైన్ ఓ పోల్ నిర్వహిస్తే.. జనాలంతా జాక్వెలిన్ కి ఓట్లు గుద్దేసి.. కిరీటం కట్టబెట్టేశారు. మరి సెక్సియెస్ట్ ఉమన్ అనిపించుకున్నాక అందాలు చూపించకుండా కవర్ పేజ్ పై కనిపిస్తే ఏం బాగుంటుంది అనుకున్న జాకీ.. తన సొగసులతో వల విసిరేసింది. వెల్లకిలా పడుకుని.. రెండు కాళ్లు సోఫా జాపి వయ్యారంగా ఓ పోజ్ కెమెరాకు విసిరింది.

అమ్మడి కళ్లలో కనిపిస్తున్న పిలుపులకు తోడు.. క్లీవేజ్ షోకుల మెరుపులు చూస్తుంటే.. సెక్సియెస్ట్ ఉమన్ కిరీటం ఈమెకు కాకుండా వేరే ఎవరికి ఇవ్వడం సరికాదని అనిపించేయడం సహజం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/