Begin typing your search above and press return to search.

ప్రియాంకాకు`ఫెమినా` క్ష‌మాప‌ణ‌లు!

By:  Tupaki Desk   |   2 Dec 2017 9:17 AM GMT
ప్రియాంకాకు`ఫెమినా` క్ష‌మాప‌ణ‌లు!
X
ప్రస్తుతం కొన్ని టీవీ చానెళ్లు త‌మ టీఆర్పీలు పెంచుకోవ‌డం కోసం కాంట్ర‌వ‌ర్షియ‌ల్ ప్రోమోల‌కు విప‌రీతంగా ప్ర‌మోట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, కొన్ని మ్యాగ‌జైన్ లు టీవీ చానెళ్ల‌కంటే రెండాకులు ఎక్కువే తిన్నాయి. త‌మ క్రేజ్ ను పెంచుకునే ప్రాసెస్ లో సెల‌బ్రిటీల ఇంట‌ర్వ్యూల‌ను కూడా వ‌క్రీకరించ‌డం ప్రారంభించాయి. వారు ఇంట‌ర్వ్యూలో ప్ర‌స్తావించ‌ని విష‌యాల‌ను కూడా త‌మ ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంటున్నాయి. మాజీ మిస్ వ‌ర‌ల్డ్ ప్రియాంకా చోప్రా ప్ర‌స్తుతం హాలీవుడ్ లో పాగా వేసిన సంగ‌తి తెలిసిందే. ఆమె న‌టించిన `క్వాంటికో` సిరీస్ హిట్ కావ‌డంతో ఆమె అంత‌ర్జాతీయ న‌టిగా గుర్తింపు పొందింది. ప్ర‌స్తుతం ఆమె రెండు హాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తూ బిజీబిజీగా ఉంది. ఈ నేప‌థ్యంలో గ‌త నెల 9న ప్ర‌ముఖ మేగ‌జైన్ ఫెమినాకు ప్రియాంక ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. అయితే, అందులో ప్రియాంక త‌న బాయ్ ఫ్రెండ్ పేరును ప్ర‌స్తావించ‌కపోయినప్ప‌టికీ....ఆ మ్యాగ‌జైన్ ఆమె చెప్పిన‌ట్లు ఒక పేరును ప్ర‌చురించింది.

న‌వంబ‌ర్ 9న 'అయామ్ ఆల్ అబౌట్ గ‌ర్ల్ ల‌వ్‌' అనే పేరుతో ఇంట‌ర్నెట్‌లో, వార‌ప‌త్రిక‌లో ప్ర‌చురిత‌మైన ఇంట‌ర్వ్యూలో ప్రియాంక త‌న మాజీ బాయ్‌ ఫ్రెండ్ గురించి చెప్పింది. అయితే, అత‌డి పేరు వెల్ల‌డించ‌లేదు. త‌న బాయ్ ఫ్రెండ్ పేరు `ఎంఎఫ్`అని ప్రియాంక చెప్పిన‌ట్లు ఆ మ్యాగ‌జైన్ ప్ర‌చురించింది. దీంతో ప్రియాంకతో పాటు ఆమె అభిమానులు కూడా తీవ్ర అసంతృప్తికి గుర‌య్యారు. ఈ విష‌యం తెలుసుకున్న ఫెమినా.... ఆమెకు - ఆమె అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతూ ఓ బ‌హిరంగ‌ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. గ‌తంలో, ఓ టీవీషో సంద‌ర్భంగా త‌న ద‌గ్గ‌ర ఉన్న ఓ జాకెట్ తన మాజీ బాయ్‌ ఫ్రెండ్ ద‌ని ప్రియాంక‌ చెప్పింది. కానీ అత‌డి పేరు మాత్రం ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. ఆ స‌మ‌యంలో ఆ జాకెట్... షారుక్ ఖాన్ ఇచ్చింద‌ని సోష‌ల్ మీడియాలో పుకార్లు కూడా వ‌చ్చాయి.