Begin typing your search above and press return to search.

అగ్ర దర్శకుడికి తలనొప్పిగా మారిన మహిళా నిర్మాత..?

By:  Tupaki Desk   |   14 Jun 2022 2:30 AM GMT
అగ్ర దర్శకుడికి తలనొప్పిగా మారిన మహిళా నిర్మాత..?
X
సినీ ఇండస్ట్రీ అనేది పురుషాదిక్య రంగంగా పేర్కొంటుంటారు. అలాంటి రంగంలో తెర వెనుక ఉంటూ సత్తా చాటిన మహిళామణులు కూడా ఉన్నారు. కాకపోతే వారి శాతం చాలా తక్కువగానే ఉంది. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్ ఒకరు ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా రాణిస్తోంది. అయితే ఆమె ఇప్పుడు ఓ స్టార్ డైరెక్టర్ కు తలనొప్పిగా మారిందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. చిన్న వయసులోనే హీరోయిన్‌ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఓ బ్యూటీ.. కొన్నేళ్లపాటు తన అందచందాలతో ఇండస్ట్రీని ఊపేసింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి అగ్ర కథానాయికగా వెలుగొందింది. తెలుగుతో పాటు మలయాళ కన్నడ హిందీ సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది.

సాధారణంగా హీరోయిన్లుగా ఫేడ్ అవుట్ అయిన ముద్దుగుమ్మలు.. తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతారు. లేదా పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంటారు. కానీ ఆమె మాత్రం సినిమా ఆఫర్స్ తగ్గిన తర్వాత నిర్మాత అవతారమెత్తింది. ఇందులో భాగంగా ఓ అగ్ర దర్శకుడితో కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ ను కూడా స్థాపించింది.

ఇప్పటి వరకు వీరి జాయింట్ ప్రొడక్షన్ లో రూపొందిన సినిమాలన్నీ మంచి విజయాలనే అందుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారు. బ్యాక్ టూ బ్యాక్ భారీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. అంతా బాగానే ఉంది కానీ.. సీనియర్ నటితో నిర్మాణ సంస్థలో పని చేసే ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని టాక్ వచ్చింది.

నిర్మాణ సంస్థ బాధ్యతలన్నీ ఇప్పుడు ఆమెనే చూసుకుంటూ వస్తోంది. అయితే ఆమె పెట్టిన కొత్త రూల్స్ వల్ల ప్రొడక్షన్ హౌస్ లో ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్న చాలా మంది విశ్వసనీయ ఉద్యోగులు.. ఇప్పుడు బయటకు వస్తున్నారట. దర్శకుడు సైతం సహ నిర్మాతను కంట్రోల్ చేయలేకపోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రొడ్యూసర్ గా వరుస సక్సెస్ లు అందుకోవడంతో.. అందరూ ఆమెను 'టాలీవుడ్ ఏక్తా క‌పూర్' గా కొనియాడుతూ వచ్చారు. దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని బ్యాంక్ రోల్ చేస్తోంది. కానీ ఇప్పుడు ఆమె వ్యవహరిస్తున్న తీరుతో నిర్మాణ సంస్థకు ఇబ్బందులు వచ్చేలా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు.