Begin typing your search above and press return to search.

అక్కడ నయన ఇక్కడ స్వీటీ ?

By:  Tupaki Desk   |   24 April 2019 5:20 AM GMT
అక్కడ నయన ఇక్కడ స్వీటీ ?
X
అభిమానులు ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్క భాగమతి తర్వాత మళ్ళి తెరమీద కనిపించలేదు. వెయిట్ లాస్ ట్రీట్ మెంట్ కోసం ఏదో విదేశాలకు వెళ్ళిందన్న టాక్ గట్టిగానే వినిపించింది కాని దానికి సంబంధించిన క్లారిటీ అనుష్క ఇవ్వనే లేదు. కోన వెంకట్ నిర్మాణంలో ఓ కొత్త దర్శకుడితో సినిమా మాత్రమే ఒప్పుకున్న స్వీటీని స్టార్ మా ఛానల్ బిగ్ బాస్ 3 కోసం కలిసిందన్న వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

రెండు సీజన్లు జూనియర్ ఎన్టీఆర్ నానిలు నడిపాక మూడో సిరీస్ యాంకర్ ను సెట్ చేసుకోవడం తలకు మించిన భారంగా మారింది. అయితే కింగ్ నాగార్జున ఆల్మోస్ట్ ఓకే అయినట్టేనని ఇంకొద్ది రోజుల్లో అఫీషియల్ న్యూస్ రావోచ్చన్న విషయమూ విదితమే. అయితే దీని కన్నా స్టార్ మా ప్రతినిధులు అనుష్క కోసం ట్రై చేశారట. ఎలాగూ ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి తను ఓకే చెబితే మంచి వేల్యూ యాడ్ అవుతుందని వాళ్ళ ఆలోచన.

ఎలాగూ తమిళ సిరీస్ కోసం నయనతారను ఫిక్స్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా అదే స్థాయి హీరొయిన్ ఉంటె ప్లస్ అవుతుందని భావించారట. కాని అనుష్క మాత్రం నో చెప్పినట్టు ఇన్ సైడ్ టాక్. తర్వాత నాగ్ సీన్ లోకి వచ్చారని తెలిసింది. ఎలాగైనా జూన్ లేదా జూలైలో బిగ్ బాస్ ౩ మొదలుపెట్టాలని చూస్తున్న స్టార్ మా ప్రస్తుతం పార్టిసిపెంట్స్ ని సెట్ చేసుకునే పనుల్లో బిజీగా ఉంది.