Begin typing your search above and press return to search.

ఫిబ్రవరి 17 బాక్సాఫీస్.. అందరికి రీస్కె!

By:  Tupaki Desk   |   2 Jan 2023 7:30 AM GMT
ఫిబ్రవరి 17 బాక్సాఫీస్.. అందరికి రీస్కె!
X
2023లో బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు పోటీ పడడానికి సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ నెలలో అలాగే జనవరిలో విడుదల కావాల్సిన చాలా సినిమాలు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ను టార్గెట్ చేసుకున్నాయి. అయితే విడుదల తేదీల కోసం మాత్రం కొన్ని చిన్న సినిమాల మధ్యలో కూడా పోటీ చాలా ఎక్కువగా కొనసాగుతోంది. పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది రిస్క్ చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు.

ఇక ఫిబ్రవరి 17వ తేదీన కూడా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒకేసారి సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా గుణశేఖర్ శాకుంతలం సినిమా ఎప్పటి నుంచో విడుదల డేట్ కోసం ఎదురుచూస్తోంది. ఈ సినిమాను గత ఎడాదిలోనే విడుదల చేయాల్సింది. అప్పట్లోనే ప్రమోషన్స్ హడావిడి బాగానే కొనసాగినప్పటికీ సినిమాకు అనుకున్నంత బజ్ పెరగలేదు.

ఇక ఇప్పుడు ఫిబ్రవరి 17వ తేదీన ఏదైనా మ్యాజిక్ జరిగితే కానీ ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ ఉండే అవకాశం లేదు. ఈ సినిమాకు సహనిర్మాతగా దిల్ రాజు ఉన్న విషయం తెలిసిందే ఇక ఆయనే సమక్షంలోనే సినిమా విడుదల కాబోతోంది కాబట్టి థియేటర్లో విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు.

అలాగే ధనుష్ తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేసిన సార్ సినిమా కూడా ఫిబ్రవరి 17వ తేదీన రాబోతోంది. ఈ సినిమాకి కూడా థియేటర్లో సమస్య పెద్దగా ఉండకపోవచ్చు.

అయితే మరో ఇద్దరు చిన్న హీరోలకు మాత్రం థియేటర్లు దొరికినా మిగతా రెండు సినిమాల ప్రభావం వలన కొంత ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంది. విశ్వక్సేన్ దమ్కీ సినిమాతో పాటు కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' రెండు సినిమాలు కూడా ఫిబ్రవరి 17వ తేదీన రాబోతున్నాయి.

కాబట్టి ఈ రెండు సినిమాలకు ఎంతో పాజిటివ్ వస్తే కానీ పోటీలో నిలదొక్కుకునెందుకు కష్టమే అని చెప్పవచ్చు. ఇక వీటితోపాటు అజయ్ దేవగన్ నటించిన మైదానం సినిమా కూడా అదే రోజు రాబోతోంది. అలాగే మరొక హాలీవుడ్ మూవీ యాంట్ మ్యాన్ అండ్ వాస్ప్ కూడా గ్రాండ్ గా ఇండియాలో విడుదల కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.